AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను రెడీ.. ప్రపంచ ఛాంపియన్ సంజూకి బీసీసీఐకి అదిరిపోయే న్యూస్.. ఇకపై కొత్త పాత్రలో బ్యాడ్ లక్కోడు..?

Sanju Samson Captaincy: 2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాలో కేరళ స్టార్ సంజు శాంసన్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. రిజర్వ్ బెంచ్ నుంచి వచ్చి వరుస హాఫ్ సెంచరీలతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజుపై బీసీసీఐ (BCCI) ఇప్పుడు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. భారత క్రికెట్ భవిష్యత్తులో అతను అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నేను రెడీ.. ప్రపంచ ఛాంపియన్ సంజూకి బీసీసీఐకి అదిరిపోయే న్యూస్.. ఇకపై కొత్త పాత్రలో బ్యాడ్ లక్కోడు..?
Sanju Samson
Venkata Chari
|

Updated on: Mar 13, 2026 | 9:56 AM

Share

Sanju Samson Captaincy: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత భారత్ సంబరాల్లో మునిగిపోయింది. ఈ చారిత్రక విజయంలో సంజు శాంసన్ పోషించిన పాత్ర అద్భుతం. టోర్నీ ఆరంభంలో అవకాశాల కోసం నిరీక్షించిన సంజు, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తుది జట్టులోకి వచ్చి తన సత్తా చాటాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో వరుసగా మూడు అర్ధసెంచరీలు బాది టీమ్ ఇండియాను విశ్వవిజేతగా నిలబెట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది.

బీసీసీఐ భారీ వ్యూహం – వైట్ బాల్ క్రికెట్‌లో ఎక్స్-ఫ్యాక్టర్..

సంజు శాంసన్ ప్రదర్శనపై బీసీసీఐ కార్యదర్శి మరియు బోర్డు వర్గాలు అత్యంత సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం టీ20లకే పరిమితం కాకుండా, రాబోయే వన్డే క్రికెట్ వ్యూహాల్లో కూడా సంజును ఒక ‘ఎక్స్-ఫ్యాక్టర్’గా పరిగణిస్తున్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు రూ. 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించిన బోర్డు, సంజుకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది. రాబోయే స్వదేశీ సిరీస్‌లలో అతనికి కీలక బాధ్యతలు అప్పగించడమే కాకుండా, జట్టును అతని చుట్టూ నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: మీరు మాత్రం 2028 టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా రావొద్దయ్యా.. మా ఇజ్జత్ పోయేలా ఉందిగా

ఇవి కూడా చదవండి

తదుపరి కెప్టెన్‌గా సంజు? మాజీల మద్దతు..

ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమ్ ఇండియా టీ20 పగ్గాలను సంజు శాంసన్‌కు అప్పగించాలనే చర్చ జోరందుకుంది. మహమ్మద్ కైఫ్, అజయ్ జడేజా వంటి మాజీ క్రికెటర్లు సంజును తదుపరి కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నట్లు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం సంజులోని మనోస్థైర్యాన్ని ప్రశంసించారు. విఫలమైనప్పుడు కృంగిపోకుండా, మళ్ళీ అవకాశాన్ని అందిపుచ్చుకుని నిలబడటం సామాన్యమైన విషయం కాదని, అలాంటి వ్యక్తి జట్టుకు సరైన దిశానిర్దేశం చేయగలడని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: 2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

రిషబ్ పంత్‌కు గట్టి పోటీ..

సంజు శాంసన్ తన ఫామ్ ను ఇదే విధంగా కొనసాగిస్తే, వైట్ బాల్ క్రికెట్‌లో రిషబ్ పంత్‌కు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం పోరాడిన సంజు, ఇప్పుడు భారత క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నాడు. కేరళ తీరాల నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతుడు టీమ్ ఇండియా భవిష్యత్ స్టార్‌గా మారబోతున్నాడనడంలో సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us