AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అలాంటోడు మా జట్టులో ఉంటే ట్రోఫీ మాదే.. టీమిండియాలో ఉన్నందుకు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాం..’

Michael Vaughan Hails Jasprit Bumrah: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజయంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. సెమీ-ఫైనల్, ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా కితాబిచ్చారు. లియోనో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలతో పోలుస్తూ, బుమ్రా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ప్రపంచ కప్ గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.

'అలాంటోడు మా జట్టులో ఉంటే ట్రోఫీ మాదే.. టీమిండియాలో ఉన్నందుకు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాం..'
Michael Vaughan Hails Jasprit Bumrah
Venkata Chari
|

Updated on: Mar 13, 2026 | 10:40 AM

Share

Michael Vaughan Hails Jasprit Bumrah: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసి, న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయానికి జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్ ఆరంభంలో తడబడినప్పటికీ, ఫైనల్‌కు చేరుకుని టైటిల్‌ను ఎగరేసుకుపోయింది టీమిండియా. ముఖ్యంగా సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై, ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బుమ్రాను తన కెరీర్‌లో చూసిన అత్యుత్తమ బౌలర్‌గా అభివర్ణించారు. బుమ్రా తన జట్టులో ఉండి ఉంటే, తమ జట్టే ట్రోఫీని గెలిచేదని వాన్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

బుమ్రాను లియోనో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రపంచ క్రీడాకారులతో పోల్చారు మైఖేల్ వాన్. బుమ్రా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ప్రపంచ కప్ గెలుస్తుందని స్పష్టం చేశారు. 1985 నుంచి క్రికెట్ చూస్తున్నానని, తాను చూసిన బౌలర్లలో అతడే అత్యుత్తమ బౌలర్ అని మైఖేల్ వాన్ ఉద్ఘాటించారు. జస్ప్రీత్ బుమ్రా 2026 టీ20 ప్రపంచ కప్‌లో మొత్తంగా 14 వికెట్లు తీయగా, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 15 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: మీరు మాత్రం 2028 టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా రావొద్దయ్యా.. మా ఇజ్జత్ పోయేలా ఉందిగా

ప్రస్తుతం భారత ఆటగాళ్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలవురు ప్లేయర్లు ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నారు. మార్చి 28 నుంచి మొదలుకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us