AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Price Today: వంట గ్యాస్‌కి కటకట.. ఏపీ, తెలంగాణలో ఈ రోజు ఎల్పీజీ ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశీయ వంట గ్యాస్ (LPG) కొరత కారణంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ముంబై, ఒడిశా, హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా వంట సిలిండర్ కొరత ఏర్పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్‌ కొరత కారణంగా పలు హోటళ్లు, హాస్టళ్లు మూత పడ్డాయి. ఐటీ కంపెనీల్లో క్యాంటీన్‌ నడపలేక సిబ్బంది చేతులెత్తేయడంతో ఉద్యోగులకు..

LPG Gas Price Today: వంట గ్యాస్‌కి కటకట.. ఏపీ, తెలంగాణలో ఈ రోజు ఎల్పీజీ ధరలు ఎలా ఉన్నాయంటే?
గ్యాస్‌ స్టౌవ్‌, బర్నర్లను తరచుగా శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. బర్నర్‌ రంధ్రాలు మూసుకుపోతే మంట సరిగా రావడం లేదు, దీంతో గ్యాస్‌ ఎక్కువగా ఖర్చవుతుంది. అందుకే స్టౌవ్‌ను శుభ్రంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
Srilakshmi C
|

Updated on: Mar 13, 2026 | 12:29 PM

Share

హైదరాబాద్‌, మార్చి 13: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం కారణంగా ప్రపంచ చమురు మార్కెటింగ్ కంపెనీలు సంక్షోభంలో కూరుకుపోయాయి. మరోవైపు ఈ సెగ భారత్‌కు సైతం తగులుతుంది. దేశీయ వంట గ్యాస్ (LPG) కొరత కారణంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ముంబై, ఒడిశా, హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా వంట సిలిండర్ కొరత ఏర్పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్‌ కొరత కారణంగా పలు హోటళ్లు, హాస్టళ్లు మూత పడ్డాయి. ఐటీ కంపెనీల్లో క్యాంటీన్‌ నడపలేక సిబ్బంది చేతులెత్తేయడంతో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం చేయమని ఉద్యోగులను కోరుతున్నారు. సరఫరా అంతరాయం వంట గ్యాస్ లభ్యతపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్ళు వంటి వాణిజ్య వినియోగదారులతోపాటు గృహ అవసరాలకు సైతం గ్యాస్‌ సిలిండర్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో డిమాండ్‌ దృష్ట్యా గ్యాస్ రేట్లు అమాంతం పెరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ. 60 పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. గత నెలలో ఈ ధర రూ.905గా ఉంది. ఇక వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ. 115 పెరిగింది. ప్రస్తుతం పలు హోటళ్లు మూత పడటంతో మరికొన్ని హోటళ్లు వెనకటి కాలం మాదిరి కట్టెల కుంపటి మీద వంట వాడ్చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ (14.5 కేజీ) ధరలు ఇలా..

  • హైదారాబాద్‌లో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 965
  • వరంగల్‌లో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 984
  • విశాఖపట్నంలో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 1112
  • విజయవాడలో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 937.50
  • గుంటూరులో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 937.50

ఇక 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండఱ్‌ 144 రూపాయలు పెరగడంతో రూ.2,105కి చేరింది. 5 కేజీల డొమెస్టిక్‌ గ్యాస్‌ ధర రూ.335 పలుకుతుంది. ఇక 47,5 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.4,900గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్నితెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..
టీమిండియా తరపున తొలి టీ20ఐ.. అతి పిన్న వయస్కుడిగా వైభవ్
టీమిండియా తరపున తొలి టీ20ఐ.. అతి పిన్న వయస్కుడిగా వైభవ్
సేమియా కేసరి సూపర్ రావాలంటే ఇలా చేసుకోండి...
సేమియా కేసరి సూపర్ రావాలంటే ఇలా చేసుకోండి...