AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HPCL Recruitment: లక్షకుపైగా జీతం.. ఈ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి, లింక్ ఇదే

HPCL Recruitment 2026: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (Hindustan Petroleum Corporation Limited) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 732 పోస్టులు భర్తీ చేయనున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంజినీర్, ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి.

HPCL Recruitment: లక్షకుపైగా జీతం.. ఈ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి, లింక్ ఇదే
Hpcl Recruitment
Rajashekher G
|

Updated on: Mar 13, 2026 | 10:28 AM

Share

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 732 పోస్టులను భర్తీ చేయనుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంజినీర్, ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి.

వయో పరిమితి: పోస్టులను అనుసరించి 25 నుంచి 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసు మినహాయింపు ఉంది.

జీతం:

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్: రూ. 30,000-1,20,000
  • ఆఫీసర్: రూ. 50 వేల నుంచి రూ. లక్షా 60 వేల వరకు
  • డిప్యూటీ జనరల్ మేనేజర్: రూ. లక్షా 20 వేల నుంచి 2 లక్షల 88వేల వరకు.
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూలతో.
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు మినహాయింపు ఉంది.
  • దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2026.
  • తాత్కాలిక పరీక్ష తేదీ: మే 3, 2026.

హెచ్‌పీసీఎల్ నోటిఫికేషన్, దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.hindustanpetroleum.com/job-openings క్లిక్ చేయండి.

Follow Us