AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. 1,484 ప్రత్యేక రైళ్లు.. ఇన్ని ట్రైన్స్‌ ఇప్పుడేందుకో తెలుసా?

Indian Railways: రిజర్వేషన్, అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు: ఈ ప్రత్యేక రైళ్లలో 749 రిజర్వ్డ్ ట్రైన్లు, మరియు 735 అన్‌రిజర్వ్డ్ ట్రైన్లు ఉంటాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను దేశంలోని పలు కీలక మార్గాల్లో నడపనున్నారు. మహారాష్ట్రలో ముఖ్య మార్గాలు..

Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. 1,484 ప్రత్యేక రైళ్లు.. ఇన్ని ట్రైన్స్‌ ఇప్పుడేందుకో తెలుసా?
Indian Railways
Subhash Goud
|

Updated on: Mar 13, 2026 | 10:03 AM

Share

Indian Railways: వేసవి సెలవులు అంటే ప్రయాణాల సందడి. పాఠశాలలకు సెలవులు రావడం, కుటుంబాలతో కలిసి పర్యటనలు ప్లాన్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు మొత్తం 1,484 సమ్మర్ స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది.

రిజర్వేషన్, అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు: ఈ ప్రత్యేక రైళ్లలో 749 రిజర్వ్డ్ ట్రైన్లు, మరియు 735 అన్‌రిజర్వ్డ్ ట్రైన్లు ఉంటాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను దేశంలోని పలు కీలక మార్గాల్లో నడపనున్నారు. మహారాష్ట్రలో ముఖ్య మార్గాలు: మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ముఖ్య మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. వాటిలో ముఖ్యంగా

ఇది కూడా చదవండి: గ్యాస్ కస్టమర్లకు మరో పిడుగు లాంటి వార్త.. బుకింగ్ గడువు ఇక 45 రోజులు

ఇవి కూడా చదవండి
  • ముంబై – దౌండ్ – సోలాపూర్
  • పుణే – కొల్హాపూర్
  • నాసిక్ రోడ్ – బద్నేరా
  • హడప్సర్ – హరంగల్

ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక రైళ్లు:

ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ముఖ్యంగా

  • ముంబై – బల్లియా
  • ముంబై – గోరఖ్‌పూర్
  • దౌండ్ – కలబురగి
  • సోలాపూర్ – కలబురగి
  • అనకాపల్లి

ముందస్తు ప్రణాళికకు సహాయం

రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, వేసవి సీజన్‌లో ముందుగానే ప్రయాణ ప్రణాళిక చేసుకోవడానికి ఈ ప్రత్యేక రైళ్లు సహాయపడతాయి. చివరి నిమిషంలో టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే రైల్వే నెట్‌వర్క్‌లో ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలను కూడా మెరుగుపరిచారు.

త్వరలో పూర్తి షెడ్యూల్

ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి టైమ్ టేబుల్, స్టాపేజ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

AI సాయంతో కొత్త విధానం

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి రైల్వేలు AI టెక్నాలజీని ఉపయోగించి టికెట్ సెర్చ్‌లు, వెయిటింగ్ లిస్ట్‌లు, ప్రయాణికుల డిమాండ్‌ను విశ్లేషించనున్నాయి. దీంతో ఏ మార్గాల్లో ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకుని అవసరమైతే అదనపు రైళ్లను కూడా నడపగలుగుతారు.

అత్యవసర కోటా పునరుద్ధరణ:

ఇదిలా ఉండగా ఇటీవల రైల్వే బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. గతంలో తొలగించిన ఎమర్జెన్సీ కోటాను మళ్లీ అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా వందే భారత్‌ స్లీపర్‌ సేవలు, అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అత్యవసర ప్రయాణాల కోసం కొన్ని బెర్త్‌లను ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ప్రయాణికుల డిమాండ్, బెర్త్‌ల లభ్యత, రైళ్ల నిర్వహణ అవసరాలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యవసర ప్రయాణాలు చేసే వారికి మరింత సౌకర్యం కలగనుంది.

ఇది కూడా చదవండి: Kerosene: ఇప్పుడు వంటగదిలోకి మళ్లీ కిరోసిన్‌.. ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us