- Telugu News Photo Gallery Cinema photos Bollywood young hero Vicky Kaushal received critical appreciation as the best performer Telugu Heroes Photos
Vicky Kaushal: బాలీవుడ్ లో మరోసారి ట్రెండ్ అవుతున్న విక్కీ కౌషల్ పేరు.! ఎందుకంటే.?
ఈ మధ్య కాలంగా బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు విక్కీ కౌషల్. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయంలతోనూ న్యూస్ హెడ్‌లైన్స్‌లో కనిపిస్తున్నారు విక్కీ. యురి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ యంగ్ హీరో ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. యురి, సర్దార్ ఉద్దమ్ సినిమాలతో బెస్ట్ పర్ఫామర్‌గా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌషల్.
Updated on: Jan 07, 2024 | 7:07 PM

ఈ మధ్య కాలంగా బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు విక్కీ కౌషల్. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయంలతోనూ న్యూస్ హెడ్‌లైన్స్‌లో కనిపిస్తున్నారు విక్కీ.

యురి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ యంగ్ హీరో ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. యురి, సర్దార్ ఉద్దమ్ సినిమాలతో బెస్ట్ పర్ఫామర్‌గా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌషల్.

అన్ సంగ్ హీరోస్ రోల్స్‌కు తాను బెస్ట్ అప్షన్ అని ప్రూవ్ చేసుకోవటంతో మీడియా కూడా ఈ యంగ్ హీరో మీద కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తోంది.

అందుకు తగ్గట్టుగా రేర్ అచ్చీవ్‌మెంట్స్‌తో న్యూస్ మేకర్ అవుతున్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. రీసెంట్‌గా డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్కీ, మరో అరుదైన ఘనత సాధించారు.

ఇన్‌స్టాగ్రామ్.. తన అఫీషియల్ పేజ్‌లో ఫాలో అవుతున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్‌గా నిలిచారు విక్కీ కౌషల్. ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన బాలీవుడ్ స్టార్స్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరు ఇన్‌స్టా ఫాలో అవుతున్న లిస్ట్‌లో లేకపోవటం విశేషం.

మూవీ సెలక్షన్ విషయంలోనూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు విక్కీ కౌషల్. హీరోనే అని ఫిక్స్ అవ్వకుండా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

సోలో హీరోగా సక్సెస్‌లు సాధిస్తూనే మల్టీ స్టారర్స్‌లోనూ నటిస్తున్నారు.




