AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: యాడ లేని పాము మన దగ్గరే.. పచ్చరంగు త్రాచును మీరెప్పుడైనా చూస్తిరా..?

శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించడం ఆసక్తి రేపింది. తిరుమలలో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ అరుదైన తాచుపాము ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి డీటేల్స్ కథనం లోపల ...

Andhra: యాడ లేని పాము మన దగ్గరే.. పచ్చరంగు త్రాచును మీరెప్పుడైనా చూస్తిరా..?
Green Cobra
Raju M P R
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 12:02 PM

Share

శేషాచలం అటవీ ప్రాంతం జీవవైవిధ్యానికి నిలయంగా పేరుగాంచింది. అనేక అరుదైన వృక్ష, జంతు జాతులు నివసించే ఈ ప్రాంతంలో తాజాగా తిరుమలలో ఒక అరుదైన పచ్చ నాగుపాము కనిపించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే ఈ పాము పూర్తిగా పచ్చ రంగులో ఉండటం ప్రత్యేకంగా నిలిచింది. దాదాపు రెండు అడుగులకుపైగా పొడవున్న ఈ పాము పడగ విప్పి కనిపించింది. సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకున్నారు. ఇది నాగుపాము జాతికి చెందినదిగా, అత్యంత విషపూరితమైనదిగా ఆయన తెలిపారు. అనంతరం దానిని శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

ఇదిలా ఉండగా, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీలో మరో పాము కనిపించడం కలకలం రేపింది. కాలేజీ ప్రాంగణంలో దాదాపు ఆరు అడుగుల పొడవున్న జర్రిపోతు కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమై టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు స్టిక్ సహాయంతో పామును సురక్షితంగా పట్టుకుని బ్యాగులో ఉంచి శేషాచలం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కాలేజీ సిబ్బంది, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..