Manchu Lakshmi: ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు చూస్తే కళ్లు జిగేల్.. ఇంద్ర భవనమే.. ఫుల్ వీడియో
రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది సర్కారు స్కూళ్లను దత్తత తీసుకున్న ఆమె విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మంచు వారమ్మాయి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు.. సందదర్భమొచ్చినప్పుడల్లా స్కూలు పిల్లలతోనే పండగలు, ఫంక్షన్లు సెలబ్రేట్ చేసుకుంటుందామె
సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నా తరచూ వార్తల్లో నిలుస్తోంది మంచు లక్ష్మి. ముఖ్యంగా టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటూ వాటి సంక్షేమానికి పాటు పడుతోంది మంచు వారమ్మాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది సర్కారు స్కూళ్లను దత్తత తీసుకున్న ఆమె విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మంచు వారమ్మాయి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు.. సందదర్భమొచ్చినప్పుడల్లా స్కూలు పిల్లలతోనే పండగలు, ఫంక్షన్లు సెలబ్రేట్ చేసుకుంటుందామె. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది మంచు లక్ష్మి. వృత్తిపరమైన పనుల రీత్యా కొన్నినెలల క్రితమే ఆమె ముంబైకు షిఫ్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తన ఇంటి విశేషాలను చెబుతూ హోం టూర్ నిర్వహించిందామె. ‘కొన్ని రోజుల క్రితమే నేను ముంబైకి షిప్ట్ అయ్యాను. నా అభిరుచులకు తగినట్టుగా నాకు నచ్చిన ఇంటి కోసం సుమారు వారం రోజుల పాటు 28 ఫ్లాట్స్ చూశా. చివరకు దీనిని ఎంచుకున్నాను’.
ఇక్కడి వస్తువులు చాలా వరకు హైదరాబాద్‌లోని నా ఇంటి నుంచి తీసుకొచ్చినవే. అందులో కొన్నింటిని రీ మోడలింగ్ చేయించాను. ఇక ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపంచే గణేశుడి పెయింటింగ్స్‌ను ఒక అమెరికన్ ఫ్రెండ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక మా అమ్మాయికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ కృష్ణుడి పెయింటింగ్ ఏర్పాటు చేశాను. హైదరాబాద్‌కు చెందిన ఒకరి వద్ద దీనిని డిజైన్ చేయించాను. ఇక నాకు మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే ప్రత్యేకంగా పుణే నుంచి వీటిని తెప్పించాను. ఇక తన ఫ్యామిలీకి చెందిన ఫొటోలను చూపిస్తూ.. ఫొటోలను ఫ్రేమ్స్ కట్టింంచి ఇలా దాచుకోవడమంటే నాకు చాలా ఆసక్తి’ అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఇంద్ర భవనాన్ని తలపిస్తోన్న మంచు లక్ష్మీ ఇంటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.
ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు.. ఫుల్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.