Bigg Boss Telugu OTT 2: బిగ్‌ బాస్‌ ఓటీటీ2లోకి కాకినాడ పిల్ల.. ‘బామ్మర్ది’ కోసం భారీగా రికమెండేషన్స్

ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో బిగ్‌ బాస్‌ ఓటీటీ సీజన్‌ 2 ను గ్రాండ్‌గా లాంఛ్‌ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడో సీజన్‌లో వినోదం అందించిన ప్రముఖ సింగర్‌ భోలే షావలి, నయని పావని, శోభా శెట్టి, రతికా రోజ్‌ని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu OTT 2: బిగ్‌ బాస్‌ ఓటీటీ2లోకి కాకినాడ పిల్ల.. 'బామ్మర్ది' కోసం భారీగా రికమెండేషన్స్
Kakinada Pilla Alias Sri Ravi
Follow us
Basha Shek

|

Updated on: Jan 07, 2024 | 3:05 PM

బిగ్‌ బాస్‌ బుల్లితెరకు షో కు ఏ మాత్రం తగ్గకూడదన్న అంచనాలతో బిగ్‌ బాస్‌ ఓటీటీ సీజన్‌ను తెరమీదకు తీసుకొచ్చారు. అయితే మొదటి సీజన్‌కు పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు. కంటెస్టెంట్ల ఎంపిక కూడా దీనికి కారణం. అయితే ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా బిగ్‌ బాస్‌ ఓటీటీ సీజన్‌ 2 ను గట్టిగా ప్లాన్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో బిగ్‌ బాస్‌ ఓటీటీ సీజన్‌ 2 ను గ్రాండ్‌గా లాంఛ్‌ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడో సీజన్‌లో వినోదం అందించిన ప్రముఖ సింగర్‌ భోలే షావలి, నయని పావని, శోభా శెట్టి, రతికా రోజ్‌ని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష పేరు కూడా బాగా వినిపిస్తోంది. అలాగే జీ తెలుగు సరిగమప షోతో సింగర్‌గా పాపులరైన పార్వతిని కూడా సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. నవాబ్‌ కిచెన్‌గా నెట్టింట బాగా ట్రెండ్‌ అవుతోన్న మోయిన్ భాయ్‌ను కూడా బిగ్‌ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే బిగ్‌ బాస్‌ ఓటీటీ సీజన్‌ 2 కోసం ఫేమస్‌ యూట్యూబర్లను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో కాకినాడకు చెందిన ఫేమస్‌ యూట్యూబర్‌ కాకినాడ పిల్ల అలియాస్‌ శ్రీ రవి కూడా ఉందని టాక్‌ వినిపిస్తోంది. ‘ఓకే బామ్మర్దీ’.. అంటూ యూట్యూబ్‌లో హల్‌ చల్‌ చేసే ఈ బ్యూటీకి మస్త్‌ ఫాలోయింగ్ ఉంది. ప్రారంభంలో ప్రాంక్‌ వీడియోలు చేస్తూ వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు ఆ తర్వాత యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందింది. తన సామాజిక మాధ్యమాల బయోల్లోనూ ఇవే విషయాలను రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కాకినాడ పిల్ల అలియాస్‌ శ్రీ రవి బిగ్ బాస్‌ ఫేమ్‌ శివాజీకి పీఆర్‌గా వ్యవహరిస్తోందట. హౌజ్‌లో ఉన్నప్పుడు శివాజీ విజయం కోసం కాకినాడ పిల్ల బాగా శ్రమించిందట. అందుకే బిగ్ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా శివాజీ మొదటి ఇంటర్వ్యూ ఈ కాకినాడ పిల్లకు ఇచ్చారంటే శ్రీ రవికున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. కేవలం శివాజీనే కాదు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌లతోనూ ఇంటర్వ్యూలు నిర్వహించిందీ అమ్మడు. ఈ నేపథ్యంలోనే శివాజీ తనకున్న పరిచయాలతో కాకినాడ పిల్లను బిగ్‌ బాస్‌ ఓటీటీ 2 హౌజ్‌లోకి పంపనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్‌ వినిపిస్తోంది. మరి మాటలతో మాయ చేసే ఈ అమ్మడికి బిగ్‌ బాస్‌ అవకాశం వరిస్తుందో లేదో చూడాలి.

శివాజీతో కాకినాడ పిల్ల..

ప్రిన్స్ యావర్ తో శ్రీ రవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?