Mission Impossible 7 OTT: ఓటీటీలో మిషన్‌ ఇంపాజిబుల్‌ 7.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పడు, ఎక్కడంటే?

'మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’. ‘డెడ్‌ రెకొనింగ్‌: పార్ట్‌ 1’ జులై 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. టామ్ క్రూజ్ , హైలీ యాట్‌వెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలోనూ ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు మంచి కలెక్షన్లే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 4600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేసుకుంది.

Mission Impossible 7 OTT: ఓటీటీలో మిషన్‌ ఇంపాజిబుల్‌ 7.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పడు, ఎక్కడంటే?
Mission Impossible The Dead Reckoning Part I Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2024 | 12:18 PM

హాలీవుడ్ సినిమాలను చూసే వారికి మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌కు ఇండియాలోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన ఆరు సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక చివ‌రి సినిమాను రెండు పార్టులుగా విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో మొద‌టి భాగం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’. ‘డెడ్‌ రెకొనింగ్‌: పార్ట్‌ 1’ జులై 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. టామ్ క్రూజ్ , హైలీ యాట్‌వెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలోనూ ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు మంచి కలెక్షన్లే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 4600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జనవరి 11 నుంచి టామ్‌ క్రూజ్‌ సినిమాను డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లిష్‌ తో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లోనూ మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ తెలిపింది.

కాగా క్రిస్టోఫర్ మెక్ క్వారీ తెరకెక్కించిన ఈ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సైమన్ పెగ్, రెబెక్కా, హెన్రీ చెర్నీ, వనేసా కొర్బీ, పోమ్, ఇసై మోరల్స్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు టామ్ క్రూజ్, దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీలే మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ స‌బ్ మెరైన్ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోతుంది. అందులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ‘ది ఎంటిటీ’ సోర్స్ కోడ్ ఉంటుంది. దీనిని కంట్రోల్ చేయ‌లంటే ‘కీ’ కావాలి. ఆ ‘కీ’ చేతికి చిక్కితే ప్రపంచాన్ని శాసించాలని కొందరు దుష్టులు ప్రయత్నించారు. దీంతో ఆ కీని శత్రువల చేతికి చిక్కకుండా ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను ఈథన్‌ హంట్‌ (టామ్‌ క్రూజ్‌) తీసుకుంటాడు. ది ఎంటిటీ’ సోర్స్ కీ కోసం ఈథన్‌ హంట్‌ ఎలాంటి సాహసాలు చేశాడో తెలుసుకోవాలంటే మిషన్‌ ఇంపాజిబుల్‌7 మూవీని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి