IND vs SA 2nd Test: మళ్లీ తేలిపోయిన టీమిండియా బ్యాటర్లు.. ఒకే రోజు 23 వికెట్లు.. ఉత్కంఠగా రెండో టెస్ట్‌

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా టీమిండియా భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా జస్‌ప్రీత్‌ బుమ్రా, ముఖేష్‌ కుమార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఒకనొకదశలో 4 వికెట్లకు 153 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించారు. దీంతో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది

IND vs SA 2nd Test: మళ్లీ తేలిపోయిన టీమిండియా బ్యాటర్లు.. ఒకే రోజు 23 వికెట్లు.. ఉత్కంఠగా రెండో టెస్ట్‌
SA vs Ind 2nd Test
Follow us

|

Updated on: Jan 03, 2024 | 10:42 PM

దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజే మొత్తం 23 వికెట్లు నేలకూలాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా టీమిండియా భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా జస్‌ప్రీత్‌ బుమ్రా, ముఖేష్‌ కుమార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఒకనొకదశలో 4 వికెట్లకు 153 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించారు. దీంతో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. కేవలం 11 బంతుల వ్యవధిలో పరుగులేమీ చేయకుండా మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది భారత జట్టు. 153 పరుగులకు ఆలౌటైన టీమిండియా కేవలం 98 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకుంది. టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి చెరో 3 వికెట్లు తీశారు.అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున ఐడాన్ మార్క్రామ్ 36, డేవిడ్ బెడింగ్‌హామ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ తన చివరి ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసి పెవిలియన్‌ చేరుకున్నాడు. టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్ మళ్లీ నిరాశపర్చారు. టీమిండియా తరఫున ముఖేష్ కుమార్2 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రాకు ఒక వికెట్ లభించింది.

అంతకు ముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 55 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా నుంచి కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. టీమిండియా తరఫున మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీశాడు. అలాగే ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. కాగా రోహిత్ సేన పేకమేడలా కూలడంపై అభిమానులు మీమ్స్‌తో సెటైర్లు వేశారు. రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన సఫారీలు తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేశారు. బెడింగ్‌ హమ్‌, మార్‌క్రమ్‌లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఇంకా 32 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు భారత బౌలర్లు ఎంత త్వరగా దక్షిణఫ్రికాను ఆలౌట్‌ చేస్తారన్న దానిపైనే రోహిత్‌ సేన విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

టీమ్ ఇండియా ప్లేయింగ్- XI:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా ప్లేయింగ్- XI:

డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడాన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ రెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఆండ్రీ బెర్గర్, లుంగి ఎన్‌గిడి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ జూలై 7న అన్న చెల్లితో విహారం
గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ జూలై 7న అన్న చెల్లితో విహారం
ఈమె లేనిదే అందానికి విలువ లేదేమో.. మానుషి సిజ్లింగ్ ఫొటొలు షేర్..
ఈమె లేనిదే అందానికి విలువ లేదేమో.. మానుషి సిజ్లింగ్ ఫొటొలు షేర్..
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా?
దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా?
ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం..
ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం..
మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం తాగినా..!
మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం తాగినా..!
నిర్జల ఏకాదశి రోజున ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
నిర్జల ఏకాదశి రోజున ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
నరరూప రాక్షసుడిలా దర్శన్.. రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్..
నరరూప రాక్షసుడిలా దర్శన్.. రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్..
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!