Shine Tom Chacko: లేటు వయసులో పెళ్లి చేసుకోనున్న ప్రముఖ నటుడు.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే?

త కొన్నాళ్లుగా ప్రేమ, రిలేషన్‌షిప్‌ విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు షైన్‌ టామ్ చాకో. తనూజ అనే అమ్మాయితో ప్రేమలో మునిగితేలుతోన్న అతను తాజాగా తమ లవ్‌ స్టోరీని అఫీషియల్‌గా ప్రకటించాడు. తాజాగా వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ ఎంగేజ్‌ మెంట్‌ ఫొటోల్ని కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Shine Tom Chacko: లేటు వయసులో పెళ్లి చేసుకోనున్న ప్రముఖ నటుడు.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే?
Shine Tom Chacko Engagement
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2024 | 9:06 PM

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ సందడి చేస్తున్నాడు. న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడీ హీరో కమ్‌ విలన్‌. ఇందులో క్రూరమైన ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత నాగ శౌర్య రంగబలి లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 2011 నుంచి సినిమాల్లో నటిస్తోన్న షైన్‌ టామ్‌ చాకోకు మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అంతకు ముందు 9 ఏళ్ల పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ మెప్పించాడు. స్పెషల్‌ రోల్స్‌తోనూ సందడి చేశాడు. ముఖ్యంగా కరోనా కాలంలో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైపోయాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఇటీవల రిలీజైన పాన్‌ ఇండియా మూవీ జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. గత కొన్నాళ్లుగా ప్రేమ, రిలేషన్‌షిప్‌ విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు షైన్‌ టామ్ చాకో. తనూజ అనే అమ్మాయితో ప్రేమలో మునిగితేలుతోన్న అతను తాజాగా తమ లవ్‌ స్టోరీని అఫీషియల్‌గా ప్రకటించాడు. తాజాగా వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ ఎంగేజ్‌ మెంట్‌ ఫొటోల్ని కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం షైన్‌ టామ్‌ చాకో వయసు సుమారు 40 ఏళ్లు. మరో 2 నెలల్లో వీరిద్దరూ కలసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షైన్ టామ్ చాకోకు ఇది రెండో వివాహమని తెలుస్తోంది. అతనికి ఇదివరకే పెళ్లయినట్లు వార్తలు వస్తున్నాయి. తబీతా అనే మహిళతో టామ్‌ చాకోకు పెళ్లయిందని, వీళ్లకు ఓ బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి కచ్చితమైన సమాచారమేమీ లేదు.

సోషల్‌ మీడియాలోనూ సెన్సేషన్‌..

సినిమాల్లో సీరియల్‌ విలన్‌ పాత్రలతో భయ పెట్టే షైన్ టామ్ చాకో నిజ జీవితంలో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. సందర్భమేదైనా, వేదిక ఏదైనా తోటి నటీనటులతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. డ్యాన్సులు చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు. అందుకే ఈ నటుడికి సోషల్‌ మీడియాలో మస్త్‌ ఫాలోయింగ్‌ఉంది. ముఖ్యంగా మలయాళంలో షైన్- లేడీ యాంకర్ పార్వతి బాబుది హిట్ కాంబినేషన్. వీళ్లిద‍్దరూ కలిసి ఏదైనా వీడియో చేశారంటే ఎంటర్ టైన్‌మెంట్ పక్కా. ఎప్పటికప్పుడు తన దైన హ్యూమరస్‌ టచ్‌తో మీమర్స్‌కి ఫుల్ స్టప్ ఇస్తుంటాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌.

ఇవి కూడా చదవండి

షైన్ టామ్ చాకో ఎంగేజ్ మెంట్..

స్నేహితులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి