Chiranjeevi: చిరంజీవి దంపతులకు బాగా ఇష్టమైన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా? అతని కోసమే రోజూ షో చూసేవారట

కేవలం సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా బిగ్‌ బాస్‌ షోను ఫాలో అవుతున్నారు. బిగ్‌ బాస్‌ వేదికపైకి వచ్చిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తాము బిగ్‌ బాస్‌ను రెగ్యులర్‌గా చూస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా బిగ్‌ బాస్‌ షోను ఫాలో అవుతారట.  ఆయన సతీమణి సురేఖ కూడా ఈ సెలబ్రిటీ గేమ్‌ షోను అసలు మిస్ అవ్వరట.

Chiranjeevi: చిరంజీవి దంపతులకు బాగా ఇష్టమైన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా? అతని కోసమే రోజూ షో చూసేవారట
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2024 | 6:51 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. డిసెంబర్‌ 17న జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. బిగ్‌ బాస్‌ హిస్టరీలోనే తొలిసారిగా ఓ కామన్‌ మ్యాన్‌ కోటాలో బిగ్‌ బాస్‌ ట్రోఫీని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఏడో సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ అడుగుపెట్టారు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్, అర్జున్ అంబటి గ్రాండ్‌ ఫినాలేకి దూసుకెళ్లారు. ఇక ఫినాలే పోటీల్లో అర్జున్‌ అంబటి ఆరో స్థానంలో నిలవగా, ప్రియాంక జైన్‌ ఐదో ప్లేసులో నిలిచింది. ఇక ప్రిన్స్‌ యావర్‌ రూ.15 లక్షలు తీసుకుని టైటిల్‌ రేసు నుంచి నిష్ర్కమించాడు. దీంతో పల్లవి ప్రశాంత్, అమర్‌ దీప్‌, శివాజీ టైటిల్‌ కోసం బరిలో నిలిచారు. మొదటి నుంచే ఈ ముగ్గురిలోనే ఒకరు టైటిల్‌ విజేతగా నిలుస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే టాప్‌-3లో శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్ నిలిచారు. చాలా మంది శివాజీనే ఏడో సీజన్‌ బిగ్‌ బాస్ టైటిల్‌ గెలుస్తాడని ఊహించారు. అయితే ఫైనల్‌లో అంతా ఉల్టా పుల్టా అయ్యింది. శివాజీ మూడో ప్లేసుతోనే సరిపెట్టుకున్నారు. అమర్‌ దీప్‌ రన్నరప్‌గా నిలవగా, పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ ట్రోఫీతో బయటకు వెళ్లిపోయాడు.

శివాజీ కోసమే..

కేవలం సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా బిగ్‌ బాస్‌ షోను ఫాలో అవుతున్నారు. బిగ్‌ బాస్‌ వేదికపైకి వచ్చిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తాము బిగ్‌ బాస్‌ను రెగ్యులర్‌గా చూస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా బిగ్‌ బాస్‌ షోను ఫాలో అవుతారట.  ఆయన సతీమణి సురేఖ కూడా ఈ సెలబ్రిటీ గేమ్‌ షోను అసలు మిస్ అవ్వరట. మరి చిరంజీవి దంపతులకు ఇష్టమైన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా? బిగ్‌ బాస్‌ పెద్దన్న, చాణక్యుడు, మాస్టర్‌ మైండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీనే. ఈ విషయాన్ని శివాజీనే స్వయంగా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను నటించిన నైన్టీస్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌ కోసం ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ చిరంజీవి అన్నయ్య కూడా ఉన్నారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి పలకరించాను. అప్పుడు చిరంజీవి అన్నయ్య… నీ కోసమే నేను సురేఖ రోజూ బిగ్ బాస్ షో చూసేవాళ్లం. చాలా బాగా అడావని కితాబిచ్చారు. ఏంటన్నయ్యా… నా కోసం మీరు బిగ్ బాస్ షో చూశారా? అని ఆశ్చర్యంగా అడిగాను. అవును… అని చిరంజీవి సమాధానం చెప్పారు’ అని శివాజీ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

శుభ శ్రీ రాయగురుతో శివాజీ స్టెప్పులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.