AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నా.. వారందరికీ థ్యాంక్స్‌’.. అల్లు అర్జున్‌ న్యూ ఇయర్ విషెస్‌

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుగానే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతున్నారు. అలాగే 2023లో తమ జీవితంలో చోటు చేసుకున్న తీపి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. పాన్‌ ఇండియా హీరో, టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు.

Allu Arjun: 'ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నా.. వారందరికీ థ్యాంక్స్‌'.. అల్లు అర్జున్‌ న్యూ ఇయర్ విషెస్‌
Allu Arjun Family
Basha Shek
|

Updated on: Dec 31, 2023 | 8:57 PM

Share

మరికొన్ని గంటల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరం 2024కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుగానే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతున్నారు. అలాగే 2023లో తమ జీవితంలో చోటు చేసుకున్న తీపి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. పాన్‌ ఇండియా హీరో, టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు. పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న ఈ ఏడాదికి సంతోషంగా వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. అలాగే 2023 తనకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పిందంటూ తన నోట్‌లో రాసుకొచ్చాడు ఐకాన్‌ స్టార్‌.

‘2023లో నా అద్బుత ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. నాకు ఇది చాలా రకాలుగా ఒక అద్భుతమైన సంవత్సరం. నేను చాలా అందమైన, ముఖ్యమైన, విలువైన పాఠాలను నేర్చుకున్నా. ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అందమైన ఈ 2023 సంవత్సరానికి ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు పలుకుతున్నాను. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూఇయర్ 2024’ అని ట్వీట్‌ చేశారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రెస్పాండ్‌ అవుతున్నారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజిబిజీగా ఉంటున్నాడు అల్లు అర్జున్‌. సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ట్వీట్..

జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకుంటోన్న అల్లు అర్జున్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి