Rohit Sharma: రోహిత్ గారాల పట్టి పుట్టిన రోజు వేడుకలు.. సమైరాతో హిట్‌ మ్యాన్‌ సరదా గేమ్స్‌.. క్యూట్ వీడియో

'సమైరా పోనివిల్లే థీమ్‌' పేరిట నిర్వహించిన బర్త్‌డే పార్టీకి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది రితిక. 'మా సమైరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మేము నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాము. నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే ఎంతో సంతోషంగా ఉండాలి. ‘నీ ఎదుగులను చూస్తూ మురిసిపోవడమే మా జీవితానికి అసలైన సార్ధకత' అంటూ

Rohit Sharma: రోహిత్ గారాల పట్టి పుట్టిన రోజు వేడుకలు.. సమైరాతో హిట్‌ మ్యాన్‌ సరదా గేమ్స్‌.. క్యూట్ వీడియో
Rohit Sharma Family
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2023 | 6:59 PM

టీమిండియా సారథి రోహిత్‌ శర్మ గారాల పట్టి సమైరా శర్మ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న హిట్‌ మ్యాన్‌ తన భార్య రితికతో కలిసి కూతురు బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో సమైరాతో బర్త్‌ డే కేక్‌ కట్‌ చేయించాడు. ఇక తన ముద్దుల కుమార్తె పుట్టిన రోజున చిన్న పిల్లాడిలా మారిపోయాడు రోహిత్‌. సమైరాతో కలిసి టాయ్‌ ట్రైన్‌లో విహరించి సందడి చేశాడు. ‘సమైరా పోనివిల్లే థీమ్‌’ పేరిట నిర్వహించిన బర్త్‌డే పార్టీకి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది రితిక. ‘మా సమైరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మేము నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాము. నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే ఎంతో సంతోషంగా ఉండాలి. ‘నీ ఎదుగులను చూస్తూ మురిసిపోవడమే మా జీవితానికి అసలైన సార్ధకత’ అంటూ తన కూతురికి ఎమోషనల్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు రోహిత్‌. ప్రస్తుతం రోహిత్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతుననాయి. అభిమానులు, నెటిజన్ల నుంచి సమైరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

రోహిత్ శర్మ, రితికలది ప్రేమ వివాహం. 2015 డిసెంబర్‌ 13న వీరు పెళ్లిపీటలెక్కారు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా 2018 డిసెంబర్‌ 30లో సమైరా పుట్టింది. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్‌ రోహిత్ బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌ లో ఐదు పరుగులు చేసిన హిట్‌ మ్యాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండు సార్లు రబాడా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. . ప్రోటీస్‌తో భారత్ తదుపరి టెస్ట్ జనవరి 3న ప్రారంభమవుతుంది. కేప్ టౌన్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

రోహిత్ కూతురు సమైరా బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో

భార్యతో రోహిత్ శర్మ…

ప్రాక్టీస్ లో రోహిత్ శర్మ..<

/h3>

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!