Shah Rukh Khan, Ram Charan: ‘ధూమ్‌ 4’ లో షారుక్‌ ఖాన్‌, రామ్‌ చరణ్‌.. దొంగ పోలీస్‌ ఆటతో ఫ్యాన్స్‌కు పండగే

షారుక్‌, రామ్‌ చరణ్‌లు ఒకే సినిమలో కలిసి నటించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్‌ నడుస్తోంది. అది కూడా క్రేజీ ఫ్రాంచైజీ ధూమ్ సిరీస్‌లో. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే ధూమ్ ఫ్రాంఛైజీలో మూడు సినిమాలను రూపొందించగా అన్నీ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు షారుక్‌ ఖాన్‌, రామ్‌ చరణ్‌లతో ధూమ్‌ 4 ను తెరకెక్కించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి

Shah Rukh Khan, Ram Charan: 'ధూమ్‌ 4' లో షారుక్‌ ఖాన్‌, రామ్‌ చరణ్‌.. దొంగ పోలీస్‌ ఆటతో ఫ్యాన్స్‌కు పండగే
Shah Rukh Khan, Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Dec 29, 2023 | 6:53 PM

షారుక్ ఖాన్, రామ్ చరణ్.. ఒకరు బాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ అయితే మరొకరు టాలీవుడ్‌లో మెగా పవర్‌ స్టార్. ఇద్దరు హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా బోలెడు అభిమానులు ఉన్నారు. వీరి సినిమాలు వందల కోట్లు కలెక్ట్‌ చేస్తున్నాయి. అలాంటి స్టార్‌ హీరోలు ఒకే స్ర్కీన్‌పై కనిపిస్తే.. ఫ్యా్న్స్‌కు పండగే.. బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలవ్వాల్సిందే. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌ నిజయమ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షారుక్‌, రామ్‌ చరణ్‌లు ఒకే సినిమలో కలిసి నటించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్‌ నడుస్తోంది. అది కూడా క్రేజీ ఫ్రాంచైజీ ధూమ్ సిరీస్‌లో. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే ధూమ్ ఫ్రాంఛైజీలో మూడు సినిమాలను రూపొందించగా అన్నీ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు షారుక్‌ ఖాన్‌, రామ్‌ చరణ్‌లతో ధూమ్‌ 4 ను తెరకెక్కించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ధూమ్‌ ఫ్రాంఛైజీలో ఇప్పటికే జాన్‌ అబ్రహం, హృతిక్‌ రోషన్‌, ఆమిర్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ హీరోలు విలన్లుగా నటించారు. అయితే ఈ మూడు సినిమాల్లో అభిషేక్‌ బచ్చన్‌ పోలీస్ పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ధూమ్‌ 4 కోసం మాత్రం హీరోతో పాటు పోలీస్‌ పాత్రను కూడా మార్చనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దొంగగా షారుక్‌ ఖాన్‌, పోలీస్ రోల్‌లో రామ్ చరణ్ యాక్ట్‌ చేస్తే బాగుంటుందని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.

‘ధూమ్’ సిరీస్‌లో కథానాయకుడికి నెగెటివ్ షేడ్ ఉంటుంది. ఇప్పటికే ‘డాన్’ సినిమాలో కూడా అలాంటి పాత్రనే పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు షారుక్. ‘ధూమ్ 4’లో ప్రధాన పాత్ర పోషించాలన్నది అభిమానుల డిమాండ్. ఈ సినిమాలో షారూఖ్, రామ్ చరణ్ నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి ఏదీ ఫైనల్ కాలేదని అంటున్నారు. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది జవాన్, పఠాన్, డంకీలతో హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టాడు షారుక్‌ ఖాన్‌. ముఖ్యంగా జవాన్‌, పఠాన్‌ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేశాయి. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబుతో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. మరి షారుక్‌, రామ్‌ చరణ్‌లతో ధూమ్‌ 4 మూవీ మేకింగ్‌పై యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు అలర్ట్.. SBIలో 13735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..