Bigg Boss Telugu OTT 2 : త్వరలోనే బిగ్‌ బాస్‌ ఓటీటీ 2.. కంటెస్టెంట్ల లిస్టులో బర్రెలక్కతో పాటు ఎవరున్నారంటే?

గతేడాది ఫిబ్రవరిలో 'బిగ్‌బాస్‌ నాన్‌- స్టాప్‌' పేరుతో డిస్నీ హాట్‌స్టార్‌లో మాత్రమే షో ప్రసారం అయింది. అది కూడా 24/7. బిందు మాధవి విజేతగా నిలిచింది. మరి బుల్లితెర బిగ్‌ బాస్‌లా పెద్దగా సక్సెస్‌ కానప్పటికీ ఉన్నంతలో కాస్త మంచిగానే బజ్‌ క్రియేట్‌ అయింది ఓటీటీ షోకి. ఈనేపథ్యంలో బిగ్‌ బాస్‌ ఓటీటీ సెకెండ్‌ సీజన్‌ కోసం..

Bigg Boss Telugu OTT 2 : త్వరలోనే బిగ్‌ బాస్‌ ఓటీటీ 2.. కంటెస్టెంట్ల లిస్టులో బర్రెలక్కతో పాటు ఎవరున్నారంటే?
Bigg Boss Telugu OTT 2
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2023 | 7:00 PM

బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్‌. బిగ్‌ బాస్‌ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఇటీవలే సక్సెస్‌ ఫుల్‌గా ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్‌ షో మరోసారి నాన్‌ స్టాప్‌ వినోదాన్ని అందించేందుకు ముస్తాబవుతోంది. అదే నండి బిగ్‌ బాస్‌ నాన్‌ స్టాప్‌ ఓటీటీ సెకెండ్ సీజన్‌. గతేడాది ఫిబ్రవరిలో ‘బిగ్‌బాస్‌ నాన్‌- స్టాప్‌’ పేరుతో డిస్నీ హాట్‌స్టార్‌లో మాత్రమే షో ప్రసారం అయింది. అది కూడా 24/7. బిందు మాధవి విజేతగా నిలిచింది. మరి బుల్లితెర బిగ్‌ బాస్‌లా పెద్దగా సక్సెస్‌ కానప్పటికీ ఉన్నంతలో కాస్త మంచిగానే బజ్‌ క్రియేట్‌ అయింది ఓటీటీ షోకి. ఈనేపథ్యంలో బిగ్‌ బాస్‌ ఓటీటీ సెకెండ్‌ సీజన్‌ కోసం నిర్వాహకులు గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారట. దీనిపై ఇటీవల ముగిసిన ఏడో సీజన్‌లో హింట్ ఇచ్చారు హోస్ట్‌ నాగార్జున. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలోనే బిగ్‌ బాస్‌ ఓటీటీ రెండో సీజన్‌ ప్రారంభమవుతుందని టాక్‌ వినిపిస్తోంది. గతేడాది ఓటీటీ షోలో కొత్త కంటెస్టెంట్స్‌ తో పాటు పాత కంటెస్టెంట్స్‌ కూడా హౌజ్‌లోకి వచ్చారు . అలా ఈసారి బిగ్‌ బాస్‌ సీజన్‌-7లో బాగా ఫేమస్‌ అయిన కొంతమందిని ఓటీటీ షో కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో పాట బిడ్డ భోలే షావలి, నయని పావణిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక కొత్త కంటెస్టెంట్ల విషయానికొస్తే కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌తో ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిందామె. దీంతో రెండు రాష్ట్రాల్లో బర్రెలక్క పేరు బాగా మార్మోగిపోయింది. దీంతో ఎలాగైనా ఆమెను హౌజ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట బిగ్‌ బాస్‌ నిర్వాహకులు. వీరితో పాటు సరిగమప షోతో సింగర్‌గా పాపులరైన పార్వతిని కూడా సంప్రదించారట. అలాగే నవాబ్‌ కిచెన్‌ తో నెట్టింట బాగా ట్రెండ్‌ అవుతోన్న మోయిన్ భాయ్‌ను కూడా బిగ్‌ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అలాగే సోషల్‌ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బర్రెలక్కతో పాటు లిస్టులో ఉన్నది వీరే..

బర్రెలక్క లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
గాల్లోకి దూసుకుపోయిన ఫ్లైట్..రన్‌వేపై దాని టైర్! తర్వత జరిగిందిదే
గాల్లోకి దూసుకుపోయిన ఫ్లైట్..రన్‌వేపై దాని టైర్! తర్వత జరిగిందిదే
గీటుకు నిలిచేదే బంగారం హాల్‌మార్క్ ఉన్నా నకిలీదేనా.. వీడియో వైరల్
గీటుకు నిలిచేదే బంగారం హాల్‌మార్క్ ఉన్నా నకిలీదేనా.. వీడియో వైరల్
కావాలనే చేస్తున్నారు.. నేను రాజీపడే మనిషిని కాను..
కావాలనే చేస్తున్నారు.. నేను రాజీపడే మనిషిని కాను..
మీ ఇంటి ఫ్లోర్ ఈ రంగులో ఉందా.. ఈ విషయాలు తెలుసుకోండి..
మీ ఇంటి ఫ్లోర్ ఈ రంగులో ఉందా.. ఈ విషయాలు తెలుసుకోండి..