AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: ‘నా నేలతల్లి సాక్షిగా మాటిస్తున్నా.. బిగ్ బాస్ ప్రైజ్‌మనీ మొత్తం రైతులకే’: పల్లవి ప్రశాంత్‌

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ విజేతగా నిలిచిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు ప్రశాంత్. తన ప్రైజ్‌ మనీ మొత్తాన్ని రైతులకే వినియోగిస్తానని బిగ్‌ బాస్‌ వేదికపైనే ప్రకటించాడు. అంతకు ముందు బిగ్‌ బాస్‌ హౌజ్‌లోనూ ఇదే మాట చెప్పాడు. తాజాగా తన ప్రైజ్‌మనీ విషయంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రైతు బిడ్డ.

Pallavi Prashanth: 'నా నేలతల్లి సాక్షిగా మాటిస్తున్నా.. బిగ్ బాస్ ప్రైజ్‌మనీ మొత్తం రైతులకే': పల్లవి ప్రశాంత్‌
Pallavi Prashanth
Basha Shek
|

Updated on: Dec 27, 2023 | 5:35 PM

Share

పల్లవి ప్రశాంత్‌.. గత రెండు మూడు నెలలుగా బాగా వినిపిస్తోన్న పేరు. ఒక కామన్‌ మ్యాన్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టిన అతను ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిచాడు. శివాజీ, అమర్‌దీప్‌ లాంటి సెలబ్రిటీలను కాదని బిగ్‌బాస్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు రైతు బిడ్డ. అయితే ఈ ఆనందం రెండు రోజులు కూడా లేకపోయింది అతనికి. గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన అల్లర్లకు సంబంధించి పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు, అలాగే అభిమానులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు రైతు బిడ్డ. ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ విజేతగా నిలిచిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు ప్రశాంత్. తన ప్రైజ్‌ మనీ మొత్తాన్ని రైతులకే వినియోగిస్తానని బిగ్‌ బాస్‌ వేదికపైనే ప్రకటించాడు. అంతకు ముందు బిగ్‌ బాస్‌ హౌజ్‌లోనూ ఇదే మాట చెప్పాడు. తాజాగా తన ప్రైజ్‌మనీ విషయంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రైతు బిడ్డ. నాగార్జున సార్‌కి మాటిచ్చానని, నేల తల్లి సాక్షిగా నాకు వచ్చిన బిగ్‌ బాస్‌ ప్రైజ్‌ మనీని రైతులకే వెచ్చిస్తానని మరోసారి బల్ల గుద్ది చెప్పాడు.

‘ గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా.. నాకు వచ్చిన 35 లక్షల్లో ప్రతి రూపాయి రైతులకే పంచి పెడతాను. ఎవరికి ఎంత ఇచ్చానని వీడియో తీసి మరీ లెక్కలతో సహా అందరికీ చూపిస్తాను. నేను బిగ్ బాస్ హౌజ్‌లోకి నాకోసం పోలేదు. నేను అప్పుడూ చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నాను. నా నేల తల్లి సాక్షిగా చెప్తున్నా.. నా పంటచేల సాక్షిగా చెబుతున్నా. నాకు వచ్చిన ప్రతిరూపాయి రైతులకే ఖర్చుపెడతాను. అందులో ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. నేను ఈ జన్మ ఎత్తిందే అన్నదాతలకు సాయం చేయడానికి. ఇన్నాళ్లు వాళ్లకేం చేయలేనేమో అనుకున్నా. ఎందుకంటే అప్పుడు నా దగ్గర పైసలు లేకుండే. బిగ్‌ బాస్‌ షోతో ఇప్పుడు నాకు రూ.35 లక్షలు వచ్చాయి.. వాటిని రైతులకు పంచుతానన్నాను. ఈ విషయంపై నాగార్జున సార్‌కి కూడా మాటిచ్చాను. బరాబర్‌ చెబుతున్నా.. ఆ 35 లక్షలు రైతులకే’ అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్‌. ప్రస్తుతం రైతు బిడ్డ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శివాజీ, ప్రిన్స్ యావర్ లతో పల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..