Pallavi Prashanth: రైతు బిడ్డ రివేంజ్‌.. వారిపై పరువు నష్టం దావా.. ఆ కంటెస్టెంటే టార్గెట్‌గా లాయర్లతో చర్చలు

బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్న పూర్ణ స్టూడియో ఎదుట పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అభిమానులు పరస్పరం కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే అమర్‌ దీప్‌, అశ్విని శ్రీ, గీతూ రాయల్‌ల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు, అభిమానులపై కేసులు నమోదయ్యాయి

Pallavi Prashanth: రైతు బిడ్డ రివేంజ్‌.. వారిపై పరువు నష్టం దావా.. ఆ కంటెస్టెంటే టార్గెట్‌గా లాయర్లతో చర్చలు
Pallavi Prashanth
Follow us

|

Updated on: Dec 25, 2023 | 7:20 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ టైటిల్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ రివేంజ్‌కు ప్లాన్‌ చేశాడా? గ్రాండ్‌ ఫినాలే అనంతరం జరిగిన ఘటనలకు సంబంధించి తనను బాధ్యుడిని చేయడంపై కోర్టు మెట్లు ఎక్కనున్నాడా? తనపై అసత్య వార్తలు ప్రసారం చేసిన కొందరు యూట్యూబర్లపై పరువు నష్టం దావా వేయనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.వివరాల్లోకి వెళితే..బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్న పూర్ణ స్టూడియో ఎదుట పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అభిమానులు పరస్పరం కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే అమర్‌ దీప్‌, అశ్విని శ్రీ, గీతూ రాయల్‌ల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు, అభిమానులపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ తనపై తప్పుడు ప్రచారం చేశాయని, అందుకే వారిపై పరువు నష్టం దావా కేసులు వేయలనుకుంటున్నాడట పల్లవి ప్రశాంత్‌. ఇందుకోసం తన లాయర్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

అసలేం జరిగిందంటే..

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్‌ ఇంటర్వ్యూల కోసం చాలా మంది ప్రయత్నించారు. అయితే తన ఊరికొస్తే మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తానని ప్రశాంత్ చెప్పినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కొంత మంది తన ఇంటర్వ్యూ కోసం ప్రశాంత్ ఊరికి వెళ్లగా.. చాలా సేపు వెయింట్‌ చేయించి, ఆ తర్వాత తీరిగ్గా వెళ్లిపొమ్మన్నాడని సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేశారు. అయితే ఈ విషయంపై రైతు బిడ్డ క్లారిటీ ఇచ్చాడు. తాను బాగా అలసిపోవడం వల్లే యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయానని వీడియోలు కూడా రిలీజ్‌ చేశాడు. అయితే అప్పటికే యూట్యూబర్ల పోస్టులతో పల్లవి ప్రశాంత్‌పై తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో తనపై దుష్ప్రచారం చేసిన యూట్యూబర్లపై పరువు నష్టం దావా వేయాలని రైతు బిడ్డ నిర్ణయం తీసుకున్నాడట. ముఖ్యంగా బిగ్‌ బాస్ ఓటీటీ సీజన్‌ కంటెస్టెంట్‌, ప్రముఖ యాంకరే లక్ష్యంగా తన లాయర్లతో ప్రశాంత్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ టు గెదర్..

బిగ్ బాస్ స్పై బ్యాచ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ