Payal Ghosh: ‘సలార్‌ చెత్త సినిమా, ఫ్లాప్.. కానీ’.. ప్రభాస్‌ మూవీపై నటి షాకింగ్‌ కామెంట్స్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది పాయల్‌. అదే సమయంలో అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్‌ అవుతోంది. అలాగే పాయల్‌ షేర్‌ చేసే సోషల్‌ మీడియా పోస్టులు కూడా తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచిందీ అందాల తార. ఇటీవల రిలీజైన ప్రభాస్‌ సలార్‌, షారుఖ్‌ ఖాన్‌ డంకీ సినిమాలను

Payal Ghosh: 'సలార్‌ చెత్త సినిమా, ఫ్లాప్.. కానీ'.. ప్రభాస్‌ మూవీపై నటి షాకింగ్‌ కామెంట్స్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌
Prabhas, Payal Ghosh
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2023 | 7:41 PM

మంచు మనోజ్‌ ‘ప్రయాణం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది కోల్‌కతా బ్యూటీ పాయల్‌ ఘోష్‌. ఆ తర్వాత ఊసర వెల్లి, మిస్కర్‌ రాస్కెల్‌ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది పాయల్‌. అదే సమయంలో అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్‌ అవుతోంది. అలాగే పాయల్‌ షేర్‌ చేసే సోషల్‌ మీడియా పోస్టులు కూడా తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచిందీ అందాల తార. ఇటీవల రిలీజైన ప్రభాస్‌ సలార్‌, షారుఖ్‌ ఖాన్‌ డంకీ సినిమాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘2023లో విడుదలైన సినిమాలన్నీ చెత్తగా ఉన్నాయి. ఒక్కటీ కూడా చూడలేని విధంగా ఉన్నాయి. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్‌లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. అయితే సలార్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తాయి. ఎందుకంటే ప్రభాస్‌ యంగ్ అండ్ పవర్‌ఫుల్‌ పర్సన్. ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది’ అని వరుసగా ట్వీట్లు చేసింది పాయల్ ఘోష్‌.

వీటితో పాటు ఈ ఏడాది బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు సాధించిన పఠాన్‌, జవాన్‌, యానిమల్‌ సినిమాలను కూడా ఏకి పారేసింది పాయల్‌ ఘోష్‌. ‘ పఠాన్‌, జవాన్‌, యానిమల్‌ సినిమాలు కూడా బాగోలేవు. అన్నీ జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయి’ అని ట్వీట్లలో రాసుకొచ్చింది పాయల్‌ ఘోష్‌. ప్రస్తుతం పాయల్‌ ట్వీట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ ట్వీట్స్‌కు ఎవరూ కూడా పెద్దగా స్పందించడం లేదు. పాయల్‌కు పెద్దగా సినిమా అవకాశాలు లేవు. వార్తల్లో నిలిచి ఫేమస్‌ అయ్యేందుకే ఇలాంటి పనికిమాలిన కామెంట్స్‌ చేస్తుందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2020లో రామ్‌దాస్‌ అథవాలే స్థాపించిన రాజకీయ పార్టీలో చేరింది పాయల్‌ ఘోష్‌. అంతేకాదు మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా ఎంపికైంది.

ఇవి కూడా చదవండి

పాయల్ వరుస ట్వీట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
పర్సనల్‌ లోన్స్‌ పొందడం ఇక మరింత ఈజీ..!
పర్సనల్‌ లోన్స్‌ పొందడం ఇక మరింత ఈజీ..!
ఐక్యూబ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన
ఐక్యూబ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన