Pallavi Prashanth: జైలు నుంచి విడుదలైన బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌.. మళ్లీ భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌

మొత్తానికి నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న రైతు బిడ్డ బెయిల్‌ పై బయటకు రావడంతో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం కూడా చంచల్‌ గూడ జైలు దగ్గరకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే గ్రాండ్‌ ఫినాలే అనంతరం జరిగిన సంఘటనల నేపథ్యంలో..

Pallavi Prashanth: జైలు నుంచి విడుదలైన బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌.. మళ్లీ భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌
Pallavi Prashanth Release
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2023 | 8:07 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. గ్రాండ్‌ ఫినాలే ముగిశాక జరిగిన ఘటనలకు సంబంధించిన కేసుల్లో అరెస్టైన రైతు బిడ్డకు శుక్రవారం (డిసెంబర్‌ 22) నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే వరుసగా సెలవులు రావడంతో సోమవారమే పల్లవి ప్రశాంత్‌ జైలు నుంచి విడుదలవుతాడని చాలా మంది భావించారు. అయితే శనివారం (డిసెంబర్‌ 23) సాయంత్రమే చంచల్‌ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీ హిల్స్‌ పోలీసులు ముందు హాజరు కావాలని పల్లవి ప్రశాంత్‌ను ఆదేశించింది. మొత్తానికి నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న రైతు బిడ్డ బెయిల్‌ పై బయటకు రావడంతో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం కూడా చంచల్‌ గూడ జైలు దగ్గరకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే గ్రాండ్‌ ఫినాలే అనంతరం జరిగిన సంఘటనల నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన ప్రశాంత్  కారులో ఎక్కి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట అభిమానుల మధ్య గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు పరస్పరం కొట్టుకున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అలాగే గ్రాండ్ ఫినాలే కు వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్లపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడు, అభిమానులపై కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసి 14 రోజుల నిమిత్తం చంచల్ గూడకు తరలించారు. అయితే శుక్రవారం నాంపల్లి కోర్టు రైతు బిడ్డకు మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చాడు.

ఇవి కూడా చదవండి

జైలు బయట సింగర్ భోలే షా వలి..

చంచల్ గూడ జైలు బయట..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!