Toby OTT: ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ టోబీ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

కన్నడ ప్రముఖ యాక్టర్‌ రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'టోబీ' ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. రూరల్‌ యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన టోబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రముఖుల ప్రశంసలు అందాయి.

Toby OTT: ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ టోబీ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?
Toby Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2023 | 9:57 PM

ఇటీవల కన్నడ సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. కేజీఎఫ్‌, చార్లీ, సప్త సాగరాలు దాటి తదితర సినిమాలు దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందులో కన్నడ ప్రముఖ యాక్టర్‌ రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘టోబీ’ ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. రూరల్‌ యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన టోబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రముఖుల ప్రశంసలు అందాయి. దీంతో టోబీ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన టోబీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌ ఈ యాక్షన్‌ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం (డిసెంబర్‌ 22) అర్ధ రాత్రి నుంచే టోబీ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది.

టోబీ చిత్రానికి బాసిల్ అచలక్కల్ దర్శకత్వం వహించారు. చరిత్ర జే ఆచార్, సంయుక్త హొరనడు, గోపాల్‍కృష్ణ దేశ్‍పాండే, రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. ప్రధాన పాత్రలో నటించడమే కాదు ఈ మూవీకి రాజ్‌ బీ శెట్టినే కథను అందించడం విశేషం. ముధున్ ముకుందన్ సంగీతం అందించారు. లైటర్ బుద్ధా ఫిల్మ్స్, అగస్త్య ఫిల్మ్స్, కాఫీ గ్యాంగ్ స్టూడియో, స్మూత్ సైలర్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఊరిలో అమాయకంగా ఉండే టోబీ (రాజ్ బీ శెట్టి)ని హత్యలు చేసేందుకు ఊరికి పెద్దగా ఉండే ఆనంద (దీపక్ శెట్టి) ఉపయోగించుకుంటుంటారు. అయితే తనను మోసం చేస్తున్నారని గ్రహించిన టోబీ ప్రతీకారంతో రగిలిపోతాడు. తనను వాడుకుంటున్న వారిపై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే టోబీ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.