Hema Chaudhary: ‘పుట్టింటికి రా’ చెల్లి నటి పరిస్థితి విషమం.. విదేశాల్లో ఉన్న కొడుకు రాక కోసం ఎదురు చూపులు

హేమ తెలుగుతో పాటు మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాలు చేశారు. తెలుగులో పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం తదితర సినిమాల్లో నటించారామె. ఇందులో ఆమె ఎక్కువగా ప్రతినాయక పాత్రలనే పోషించారు. కాగా రెండు రోజుల క్రితం హేమ చౌదరికి బ్రెయిన్‌ హెమరేజ్‌ అయింది

Hema Chaudhary: 'పుట్టింటికి రా' చెల్లి నటి పరిస్థితి విషమం.. విదేశాల్లో ఉన్న కొడుకు రాక కోసం ఎదురు చూపులు
Hema Chaudhary
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2023 | 9:05 PM

ప్రముఖ కన్నడ సినీ నటి హేమా చౌదరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . దీంతో ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం హేమా చౌదరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. హేమా చౌదరి బ్రెయిన్ హెమరేజ్‌కి గురైనట్లు తెలుస్తోంది. హేమ తెలుగుతో పాటు మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాలు చేశారు. తెలుగులో పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం తదితర సినిమాల్లో నటించారామె. ఇందులో ఆమె ఎక్కువగా ప్రతినాయక పాత్రలనే పోషించారు. కాగా రెండు రోజుల క్రితం హేమ చౌదరికి బ్రెయిన్‌ హెమరేజ్‌ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరచించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్యం అందిస్తున్నారు. హేమ కొడుకు ఐర్లాండ్‌లో ఉన్నాడు. హేమ అతని రాక కోసం ఎదురుచూస్తోంది. చికిత్సకు నటి శరీరం స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు.

హేమ 70వ దశకంలో సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించారు. కన్నడలో రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్‌నాగ్, అనంతనాగ్, రవిచంద్రన్ వంటి ప్రముఖ హీరోలతో కలిసి నటించారు. ఇక తెలుగులో కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు నటించిన సినిమాల్లో కనిపించారు. అలాగే బాలచందర్‌, యోగానంద్‌, దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, సింగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ తదితర దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

ఐర్లాండ్ లో కుమారుడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.