Samantha Citadel: సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

ఫ్యామిలీ మ్యాన్‌ 2 తర్వాత సమంత నటిస్తోన్న వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్‌ సిటాడెల్‌కు ఇండియన్‌ రీమేక్‌గా ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది. బాలీవుడ్ హ్యాండ్సమ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే సిటాడెల్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. సమంత కూడా తన షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్‌ చేసింది.

Samantha Citadel: సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?
Samantha Citadel Web Series
Follow us
Basha Shek

|

Updated on: Dec 19, 2023 | 5:44 PM

ఖుషి సినిమా తర్వాత వెండితెరపై కనిపించలేదు టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత. ప్రస్తుతం ఎక్కువగా సోషల్‌ మీడియాలోనే దర్శనమిస్తోందామె. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్‌ 2 తర్వాత సమంత నటిస్తోన్న వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్‌ సిటాడెల్‌కు ఇండియన్‌ రీమేక్‌గా ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది. బాలీవుడ్ హ్యాండ్సమ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే సిటాడెల్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. సమంత కూడా తన షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్‌ చేసింది. అయితే ఇప్పటివరకు సిటాడెల్ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. అప్‌ డేట్స్‌ కూడా ఆగిపోయాయి. అయితేఈ సిరీస్‌ రిలీజ్ డేట్‌పై సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సిటాడెల్‌ సిరీస్‌ మే చివరి వారం లేదా జూన్‌ ఫస్ట్‌ వీక్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సిటాడెల్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. మార్చి నుంచి సిటాడెల్‌ సిరీస్‌ ప్రమోషన్లలో సమంత పాల్గొననున్నట్లు తెలుస్తోంది

ఫ్యామిలీ మ్యాన్‌-1,2, ఫర్జీ వెబ్‌ సిరీస్‌లతో సంచలనం సృష్టించిన దర్శక ద్వయం డీకే రాజ్‌ సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కిస్తున్నారు. సమంత, వరుణ్ ధావన్‌ స్పై ఏజెంట్లుగా నటిస్తున్నారు. త్వరలోనే సిటాడెల్‌ వెబ్ సిరీస్‌ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటించింది సమంత. శాకుంతలం నిరాశపర్చగా, ఖుషి మాత్రం సూపర్‌ హిట్‌ గా నిలిచింది. అయితే ఖుషి రిలీజ్‌ రోజే విదేశాలకు వెళ్లిపోయింది సమంత. మయోసైటిస్‌ చికిత్స కోసమే ఆమె అమెరికా వెళ్లిందని వార్తలొచ్చాయి. అదే సమయంలో ఓ హాలీవుడ్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లిందని ప్రచారం సాగింది. అయితే దీనిపై సామ్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఖుషి తర్వాత ఓ తమిళ సినిమాలో సమంత నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ టీవీ షోలో సమంత..

సిటా డెల్ షూటింగ్ లో సమంత

సమంత ఇన్ స్టా గ్రామ్ పోస్ట్స్..

View this post on Instagram

A post shared by MTV Hustle (@mtvhustle)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?