Ustaad Promo: డీజే టిల్లుతో మంచు మనోజ్ సందడి.. ‘ఉస్తాద్’ కొత్త ప్రోమో.. కామెడీ జోరు..

ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఈవిన్'లో ఉస్తాద్ షో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. ఈషోకు మొదటి అతిథిగా న్యాచురల్ స్టార్ నాని వచ్చి సందడి చేశాడు. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈషోకు సెకండ్ అతిథిగా యంగ్ హీరోస్ డీజే టిల్లు వచ్చారు. ప్రోమో ఆద్యంతం సరదాగా సాగింది. సిద్ధూతో కలిసి మంచు మనోజ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. సిద్ధూ ఏ స్క్రిప్ట్ అయినా KISS తో స్టార్ట్ చేస్తాడంటూ.. ఆన్ స్క్రీన్ లిప్ కిస్ ఫోటోస్ రివీల్ చేశాడు.

Ustaad Promo: డీజే టిల్లుతో మంచు మనోజ్ సందడి.. 'ఉస్తాద్' కొత్త ప్రోమో.. కామెడీ జోరు..
Manoj, Siddu Jonnalagadda
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 20, 2023 | 12:31 PM

చాలా కాలం తర్వాత మంచు మనోజ్ హోస్ట్‏గా చేస్తోన్న టాక్ షో ‘ఉస్తాద్’. ఈ షో ద్వారా టాలీవుడ్ సెలబ్రెటీస్‏ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఈవిన్’లో ఉస్తాద్ షో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. ఈషోకు మొదటి అతిథిగా న్యాచురల్ స్టార్ నాని వచ్చి సందడి చేశాడు. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈషోకు సెకండ్ అతిథిగా యంగ్ హీరోస్ డీజే టిల్లు వచ్చారు. ప్రోమో ఆద్యంతం సరదాగా సాగింది. సిద్ధూతో కలిసి మంచు మనోజ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. సిద్ధూ ఏ స్క్రిప్ట్ అయినా KISS తో స్టార్ట్ చేస్తాడంటూ.. ఆన్ స్క్రీన్ లిప్ కిస్ ఫోటోస్ రివీల్ చేశాడు.

డీజే టిల్లు రాధికల్లాగా నిజ జీవితంలోనూ ఎవరైనా తగిలారా అంటూ ప్రశ్నలు కురిపించాడు. మనోజ్, సిద్ధూ మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. ఎప్పటిలాగే మనోజ్ తన స్టైల్లో కామెడీని పండించాడు. రెగ్యూలర్ అన్ని షోల మాదిరిగా కాకుండా తనకు ఇష్టమొచ్చినట్లు సెట్ లో తిరిగేస్తూ సోఫాలపై పడుకుంటూ అల్లరి చేశాడు. ఇది షోగా లేదు.. మనోజ్ ఇల్లులా ఉందంటూ సిద్ధా సరదాగా అన్నాడు. ప్రస్తుతం ఉస్తాద్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది.

మనోజ్.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇక ఇటీవలే భూమా మౌనికతో సెకండ్ మ్యారెజ్ అనంతరం.. మనోజ్ తన కెరీర్ మళ్లీ స్టార్ట్ చేశారు. ఈసారి కొత్తగా సినిమాలతోపాటు.. హోస్ట్‏గాను అలరిస్తున్నాడు. ఇప్పటికే బాలయ్య, రానా, సమంత ఓటీటీ మాధ్యమాలలో టాక్ షోలతో హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మంచువారబ్బాయి హోస్టింగ్ అదరగొట్టేస్తున్నాడు. ఉస్తాద్ టాక్ షోను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈ షోతోపాటు… మనోజ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి వాట్ ది ఫిష్, అహం బ్రహ్మస్మి. ఈ రెండు సినిమాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయ. వచ్చే ఏడాదిలో ఈ చిత్రాలు అడియన్స్ ముందుకు రానున్నాయి. అలాగే సిద్ధూ.. ప్రస్తుతం డీజే టిల్లు సిక్వెల్ 2 లో నటిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.