AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్ ఆట మాత్రమే.. మనుషుల్లా ప్రవర్తిద్దాం.. ఫ్యాన్స్‌ గలాటాపై మాజీ విన్నర్ కౌశల్

అంతా బాగానే ఉంది కానీ బిగ్‌ బాస్‌ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌ ఆర్టీసీ బస్సులతో పాటు గ్రాండ్‌ ఫినాలేకు వచ్చిన అమర్ దీప్‌, గీతూ రాయల్‌ కార్లపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై బిగ్ బాస్‌ సీజన్‌ రెండో విన్నర్‌ కౌశల్‌ స్పందించాడు

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్ ఆట మాత్రమే.. మనుషుల్లా ప్రవర్తిద్దాం.. ఫ్యాన్స్‌ గలాటాపై మాజీ విన్నర్ కౌశల్
Kaushal Manda
Basha Shek
|

Updated on: Dec 19, 2023 | 4:21 PM

Share

బుల్లితెర అభిమానులను అమితంగా అలరించిన బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ కు శుభం కార్డు పడింది. కామన్‌ మెన్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. గ్రాండ్‌ ఫినాలే కూడా అట్టహాసంగానే జరిగింది. అంతా బాగానే ఉంది కానీ బిగ్‌ బాస్‌ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌ ఆర్టీసీ బస్సులతో పాటు గ్రాండ్‌ ఫినాలేకు వచ్చిన అమర్ దీప్‌, గీతూ రాయల్‌ కార్లపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై బిగ్ బాస్‌ సీజన్‌ రెండో విన్నర్‌ కౌశల్‌ స్పందించాడు. బిగ్‌ బాస్‌ షో కేవలం ఆట మాత్రమేనని, ఎవరూ సీరియస్‌ గా తీసుకోవద్దని అభిమానులకు సూచించాడు. ‘బిగ్‌బాస్‌ షో కేవలం ఆట మాత్రమే. ఎవరూ పర్సనల్‌గా తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈ షోలో ఒకరితో ఒకరు పోటీపడిన తర్వాత కూడా, కంటెస్టెంట్లు బయటకు వచ్చి మంచి ఫ్రెండ్స్‌గా కలిసిపోతారు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో గెలిచేందుకు ఎన్నో వ్యూహాలు ఉపయోగించాల్సి రావొచ్చు. అయితే ఇదొక కేవలం ఆట మాత్రమేనని. ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దు’

ఒకరి అభిమానులు మరొకరి ఫ్యాన్స్‌ పై దాడులకు పాల్పడడం చాలా నిరుత్సాహానికి గురి చేసింది. ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీలను అయోయమంలో పడేస్తాయి. షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ వారి జీవితాలతో ముందుకు సాగనివ్వాలి. సోషల్ మీడియా ద్వారా ఎవరిపై, ఎప్పుడైనా మన ప్రేమ, అభిమానాన్ని చూపించవచ్చు. అయితే ఎప్పుడూ లిమిట్స్‌ దాట కూడదు. ఇది మన ప్రేమను చూపుతున్న వ్యక్తి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావంచ ఊపుతంది. ఇలాంటి వ్యక్తులు తమకు కుటుంబాలు ఉన్నాయనే నిజాన్ని గుర్తుంచుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్‌ యాక్టర్స్‌గా ఎదగడానికి, వారి కుటుంబాల కోసం ఎంతో కష్టపడి పని చేస్తారు. వారు అనుభవించే బాధ, ఒత్తిడిని అర్థం చేసుకోవడం, వారితో గౌరవంగా ఉండటం చాలా ముఖ్యం. మనం మనుషుల్లా ప్రవర్తిద్దాం. మన పట్ల, మన కుటుంబాల పట్ల మనం కోరుకునే దయ, సానుభూతిని ఇతరులతోనూ చూపిద్దాం. ఈ చిల్లర పనుల వల్ల కలిగే బాధ, ఆవేదన నాకు బాగా తెలుసు. దయచేసి ఇలాంటివి ఆపండి. వారి జీవితాలను హ్యాపీగా లీడ్‌ చేసుకోనివ్వండి’ అని సుదీర్ఘమైన పోస్ట్‌ చేశాడు కౌశల్‌ . ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కౌశల్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.