AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: మరీ ఇంత దారుణమా.! పాపం అశ్విని.. కారు డోర్ ఓపెన్ చేసి ఆమెను బయటకు లాగుతూ..

ఫ్యాన్స్ పేరుతో కొంతమంది చేసిన హంగామా ఇప్పుడు సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. బిగ్ బాస్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ దీప్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. కొంతమంచి అన్నపూర్ణ స్టూడియోస్ గేట్స్ ను బద్దలు కొట్టే ప్రయత్నం కూడా చేశారు. అలాగే స్టూడియో నుంచి బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ పై దాడి చేశారు.

Bigg Boss 7 Telugu: మరీ ఇంత దారుణమా.! పాపం అశ్విని.. కారు డోర్ ఓపెన్ చేసి ఆమెను బయటకు లాగుతూ..
Ashwini Sri
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2023 | 4:46 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 ఎలా జరిగింది అన్నదానికంటె ఇప్పుడు ఫినాలే రోజు జరిగిన రచ్చ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఫ్యాన్స్ పేరుతో కొంతమంది చేసిన హంగామా ఇప్పుడు సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. బిగ్ బాస్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ దీప్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. కొంతమంచి అన్నపూర్ణ స్టూడియోస్ గేట్స్ ను బద్దలు కొట్టే ప్రయత్నం కూడా చేశారు. అలాగే స్టూడియో నుంచి బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ పై దాడి చేశారు. ఆడ, మగ అని తేడా లేకుండా ఫ్యాన్స్ పేరుతో కొంతమంది విచ్చలవిడిగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అమర్ దీప్ కారు ధ్వంసం అయ్యింది. దాంతో పాటు మరికొంతమంది కార్లు కూడా ధ్వంసం అయ్యాయి.

అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన గీతూ రాయల్, శోభా శెట్టి, అశ్విని, రతికా కార్ల పై కూడా కొందరు దాడి చేశారు. తాజాగా అశ్విని కారు పై ఫ్యాన్స్ దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏమాత్రం మానవత్వం లేకుండా అక్కడ ఉన్నది అమ్మాయి అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు కొందరు.

అశ్విని కారుకు అడ్డుపడి ఆమె కారు అద్దాలు పగలకొట్టారు.ఆ అలాగే కారు డోర్ ఓపెన్ చేసి ఆమె చెయ్యి పట్టుకొని బయటలకు లాగే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె భయంతో కేకలు వేసింది. ఆ తర్వాత ఆమె కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫ్యాన్ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భారీ గలాటనే జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఫ్యాన్స్ ను చెదరగొట్టారు. కొందరి పై కేసులు కూడా నమోదు చేశారు. మరో వైపు గీతూ రాయల్ కూడా తన పై జరిగిన దాడి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అశ్విని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అశ్విని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..