Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ను బ్యాన్‌ చేయాల్సిందే.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ

ప్రశాంత్‌-అమర్‌దీప్‌ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాటకు దిగారు. టైటిల్ తమకు దక్కాల్సిందని అమర్‌దీప్‌ అభిమానులు.. సత్తా ఉన్న వాడికే టైటిల్ దక్కిందని ప్రశాంత్ ఫ్యాన్స్‌ నినాదాలు చేసుకున్నారు. ఇదికాస్త గొడవకు దారితీసింది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో పార్టీసిపెంట్‌ల కార్లు, TSRTCకి చెందిన బస్సులపై దాడికి దిగారు.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ను బ్యాన్‌ చేయాల్సిందే.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ
CPI Narayana
Basha Shek
|

Updated on: Dec 18, 2023 | 9:36 PM

Share

బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుండం. హౌస్‌లో కంటెస్ట్‌ల ఆటలైనా.. పాటలైనా.. వాళ్లేం చేసినా కేరాఫ్‌ కాంట్రవర్శీనే. ఆ సంగతి అలా ఉంటే.. వాళ్ల అభిమాన సంఘాల అడ్డగోలు గగ్గోలు మరో లెవెల్‌. సోషల్ మీడియాలో వాళ్లు చేసే అతి అంతకుమించి నీచం అనేలా ఉంటుంది. లేటెస్ట్‌గా బిగ్ బాస్ -7 సీజన్‌ క్లైమాక్స్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. హౌస్‌లో ప్లేయర్లు కుస్తీకి దిగినట్టే.. రియల్‌ లైఫ్‌లో అభిమానులు హద్దులు దాటారు. 105 రోజుల పాటు సాగిన రియాల్టీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్‌.. రన్నరప్‌గా అమర్‌దీప్‌ నిలిచాడు. ఇక్కడే రాద్ధాంతం మొదలైంది. ప్రశాంత్‌-అమర్‌దీప్‌ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాటకు దిగారు. టైటిల్ తమకు దక్కాల్సిందని అమర్‌దీప్‌ అభిమానులు.. సత్తా ఉన్న వాడికే టైటిల్ దక్కిందని ప్రశాంత్ ఫ్యాన్స్‌ నినాదాలు చేసుకున్నారు. ఇదికాస్త గొడవకు దారితీసింది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో పార్టీసిపెంట్‌ల కార్లు, TSRTCకి చెందిన బస్సులపై దాడికి దిగారు. విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం జరిగిన సంఘటనలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. అసలు బిగ్‌బాస్‌ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారాయన. వినోదాన్ని ఆస్వాదించకుండా.. అభిమానం పేరుతో ఏమైనా చేయొచ్చా..? హద్దులు మీరి బరితెగిస్తే చూస్తూ ఉండిపోవాలా? ప్రభుత్వ ఆస్తుల నష్టం దాకా వెళ్లారంటే వీళ్లని ఏమనాలి? ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్‌.. బిగ్గెస్ట్‌ రియాల్టీ షో… షో నిర్వాహకుల గొప్పలు సరే.. మరి అభిమానం పేరుతో వెర్రితలలు వేస్తోన్న వికృత పోకడల సంగతేంటి? బిగ్ బాస్ -7 విన్నర్ ప్రకటించిన కాసేపటికే.. అభిమానం హద్దులు దాటింది.. ఆర్టీసీ బస్సులపై దాడి చేసే దాకా వెళ్లింది. ఫ్యాన్స్‌ది బలుపు అనుకోవాలా? కండకావరం అనుకోవాలా? కొంతమంది చేసే నిర్వాకాలతో.. బిగ్ బాస్ షో బ్యాన్ డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.