Bigg Boss 7 Telugu: అర్జున్‌ అంబటి ఎలిమినేట్‌.. విన్నర్‌తో సమానంగా రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలో తెలుసా?

ఎలాంటి గొడవలు, వివాదాలకు పోకుండా హౌజ్లో హుందాగా వ్యవహరించాడీ సీరియల్ యాక్టర్. టాస్కులు, గేమ్స్‌లో సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. పవర్‌ అస్త్ర సాధించి ఏడో సీజన్‌ లో గ్రాండ్‌ ఫినాలేకు దూసుకెళ్లిన మొదటి కంటెస్టెంట్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అంతా బాగున్నా అభిమానుల ఓట్లు సంపాదించడంలో బాగా వెనక బడ్డాడు అర్జున్‌.

Bigg Boss 7 Telugu: అర్జున్‌ అంబటి ఎలిమినేట్‌.. విన్నర్‌తో సమానంగా రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలో తెలుసా?
Bigg Boss 7 Telugu, Arjun Ambati
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2023 | 9:15 PM

బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే నుంచి అంబటి అర్జున్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. హౌజ్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈ సీరియల్‌ నటుడు తనదైన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి గొడవలు, వివాదాలకు పోకుండా హౌజ్లో హుందాగా వ్యవహరించాడీ సీరియల్ యాక్టర్. టాస్కులు, గేమ్స్‌లో సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. పవర్‌ అస్త్ర సాధించి ఏడో సీజన్‌ లో గ్రాండ్‌ ఫినాలేకు దూసుకెళ్లిన మొదటి కంటెస్టెంట్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అంతా బాగున్నా అభిమానుల ఓట్లు సంపాదించడంలో బాగా వెనక బడ్డాడు అర్జున్‌. అందుకే ఆరో స్థానంతో సరిపెట్టుకుని హౌజ్‌ నుంచి బయటకు వచ్చాడు. ఆదివారం జరిగిన బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో అర్జున్‌ అంబటి మొదటిగా ఎలిమినేట్‌ అయ్యాడు. స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల రోబో సహాయంతో అర్జున్ అంబటిని హౌజ్‌ నుంచి బిగ్‌ బాస్‌ స్టేజీపైకి తీసుకొచ్చింది. అయితే హౌజ్‌లో ఎంతో హుందాగా వ్యవహరించిన అర్జున్‌ ఎలిమినేషన్ సమయంలోనూ ఎంతో సమయస్ఫూర్తితో మెలిగాడు. ‘నన్ను నువ్వే తీసుకురావాలా’ అంటూ సుమతో చమత్కారంగా మాట్లాడాడు.

ఈ సందర్బంగా అర్జున్ అంబటి భార్య సురేఖ బిగ్‌ బాస్‌ స్టేజ్‌పైకి వచ్చింది. చాలా రోజుల తర్వాత తన భర్తను కలవడంతో బాగా ఎమోషనల్‌ అయ్యింది సురేఖ. ఇక మొత్తమ్మీద అర్జున్ అంబటి సుమారు 10 వారాలు హౌజ్‌ లో కొనసాగాడు. ఇందుకోసం రోజుకు రూ. 35వేల పారితోషకం తీసుకున్నాడు. అంటే వారానికి సుమారు రూ. 2, 45,000. మొత్తమ్మీద అర్జున్‌ రూ. 24.5 లక్షల రెమ్యునరేషన్‌ అందుకున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఇతర కంటెస్టెంట్స్‌ తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలవకపోయినా అందుకు సమానమైన రెమ్యునరేషన్ అర్జున్‌ అందుకున్నట్లే.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ వేదికపై భార్యతో అర్జున్ అంబటి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?