Anushka Sharma: విరుష్క దంపతులు మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నారా? అనుష్క బేబీ బంప్‌ ఫొటోస్‌ వెనక అసలు విషయమిదే

అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయిందనే గాసిప్‌లకు చాలా కారణాలు ఉన్నాయి. ‘జీరో’ సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. ఇప్పటికే అంగీకరించిన 'చక్దా ఎక్స్‌ప్రెస్' సినిమా విడుదల అంతకంతకూ ఆలస్యం అవుతోంది. రెండో సంతానం కావాలనే ఉద్దేశంతోనే ఆమె నటనకు దూరంగా ఉండిపోయిందని పలువురు భావిస్తున్నారు.

Anushka Sharma: విరుష్క దంపతులు మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నారా? అనుష్క బేబీ బంప్‌ ఫొటోస్‌ వెనక అసలు విషయమిదే
Virat Kohli, Anushka Sharma
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2023 | 8:19 PM

కొన్ని రోజులుగా నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లి రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అనుష్క శర్మ కానీ, విరాట్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా గాసిప్ లు గుప్పుమంటున్నాయి. దీంతో పాటు అనుష్క శర్మ బేబీ బంప్‌తో ఉందంటూ సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విరుష్క దంపతులు మళ్లీ అమ్మానాన్నలవుతున్నారని చాలామంది నమ్ముతున్నారు. అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయిందనే గాసిప్‌లకు చాలా కారణాలు ఉన్నాయి. ‘జీరో’ సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. ఇప్పటికే అంగీకరించిన ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ సినిమా విడుదల అంతకంతకూ ఆలస్యం అవుతోంది. రెండో సంతానం కావాలనే ఉద్దేశంతోనే ఆమె నటనకు దూరంగా ఉండిపోయిందని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు అనుష్క, విరాట్ కోహ్లీలకు సంబంధించిన మరొక ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇందులో విరాట్ సతీమణి బేబీ బంప్‌తో కనిపిస్తోంది. అయితే ఇది కొత్త ఫొటో కాదు. దీపావళి పండుగ 2018 సందర్భంగా క్లిక్ చేసిన ఫొటో. దానిని ఇప్పుడు ఎడిట్ చేసి మళ్లీ వైరల్ చేస్తున్నారు. దీనిని చూసిన వారందరూ అనుష్క రెండోసారి గర్భం ధరించడం నిజమేనని నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి

2017లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2021 జనవరిలో ఈ దంపతులకు వామిక అనే కూతురు జన్మించింది. ప్రస్తుతం కూతురు ఆలనా పాలన చూసుకునే పనిలో బిజీగా ఉంటోంది అనుష్క. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. ఇక అనుష్క శర్మ 2008లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. షారుఖ్‌తో ‘రబ్నే బనాదీ జోడీ’ సినిమాతో ఎంట్రీలోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టేసింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, అమీర్ ఖాన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ నటులతో నటించి మెప్పించింది. నటిగానే కాకుండా విజయవింతమైన చిత్రాలను నిర్మించి మంచి విజయాలను సొంతం చేసుకుంది.

ఎడిటెడ్ ఫొటోస్ వైరల్..

అసలు ఫొటో ఇదే..

ఏడడుగుల బంధానికి ఆరేళ్లు పూర్తి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే