Aishwarya Rai-Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకుల వార్తలన్నీ రూమర్లే.. ఇదిగో సాక్ష్యం

గతకొంతకాలంగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ కలిసి కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అలాగే ఈ రూమర్స్ పై అటు ఐష్ కానీ అభిషేక్ కానీ ఎవరూ స్పందించలేదు. దాంతో ఈ ఇద్దరు ఖచ్చితంగా విడిపోతున్నారని వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని తేలింది. ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసి ఓకేదగ్గర కనిపించారు.

Aishwarya Rai-Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకుల వార్తలన్నీ రూమర్లే.. ఇదిగో సాక్ష్యం
Abhishek, Aishwarya
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 16, 2023 | 11:38 AM

బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ , అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ గురించి ఇటీవల చాలా వార్తలువినిపిస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారనే పుకార్లు బాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. గతకొంతకాలంగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ కలిసి కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అలాగే ఈ రూమర్స్ పై అటు ఐష్ కానీ అభిషేక్ కానీ ఎవరూ స్పందించలేదు. దాంతో ఈ ఇద్దరు ఖచ్చితంగా విడిపోతున్నారని వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని తేలింది. ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసి ఓకేదగ్గర కనిపించారు. దీంతో పుకార్లకు తెరపడింది. అభిషేక్ ,ఐశ్వర్య కలిసి కనిపించిన తర్వాత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అభిషేక్ ,ఐశ్వర్య కూతురు ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది. ఆమె పాఠశాలలో శుక్రవారం (డిసెంబర్ 15) ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్, అగస్త్య నంద హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబ సభ్యులంతా కలిసి కనిపించడంతో చాలా పుకార్లకు తెరపడింది.

ఇటీవలే అగస్త్య నంద మొదటి సినిమా ‘ది ఆర్చీస్’ విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆ అప్పుడు అందరూ కలిసి కనిపించలేదు. ఇప్పుడు ఆరాధ్య కోసం ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ విడివిడిగా జీవిస్తున్నారని టాక్ రావడం. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వర్యను అమితాబ్ అన్‌ఫాలో చేయడం సెన్సేషన్ గా మారాయి.  ఇప్పుడు ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. ఐశ్వర్య , అభిషేక్ బచ్చన్ 2007 లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో  కుమార్తె ఆరాధ్య జన్మనిచ్చింది.

View this post on Instagram

A post shared by Snehkumar Zala (@snehzala)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.