AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: చల్లని కబురు.! వీరికి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

శుక్ర, కుజ, రవుల అనుకూలత ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపో తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.

Horoscope Today: చల్లని కబురు.! వీరికి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 05, 2026 | 7:02 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రాశ్యధిపతి కుజుడు, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం ఆశించిన దాని కంటే  ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

గురు, శుక్ర, శని గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్న ఫలితంగా ఉద్యోగంలో ఒక వెలుగు వెలుగుతారు. బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందు తాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్తగా ఆఫర్లు అందుతాయి.  ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.  ఆదాయం పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడు, రవి, శుక్ర గ్రహాల అనుకూల సంచారం వల్ల ఉద్యోగంలో ఆశిం చిన పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో విశేషంగా పురోగతి చెందుతారు. తోబుట్టు వులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుక్ర, శనులు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందు తాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయతాలు సానుకూల ఫలి తాలనిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయం సాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహా రాలు సంతృప్తికరంగా, సకాలంలో పూర్తవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుజ, గురు గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్లగా పనుల ఒత్తిడి నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం జరు గుతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి రంగంలోని వారికి అవకాశాలు బాగా పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య లకు పరిష్కారం లభిస్తుంది.  ఆదాయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.  అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం ఉత్తమం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురు, కుజ, శని గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అ కాశం ఉంది. ఉద్యోగం మారకపోవడం మంచిది. ఆదాయానికి లోటుండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

కుజ, రవి. బుధ గ్రహాల అనుకూలత వల్ల ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంటా బయటా  అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల,  పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుజ, రవి, బుధ, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధా న్యం పెరుగుతుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా ఫలి స్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థిక విషయాలు సజావుగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్య పరిష్కారమవు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

శుక్ర, శని, రవి, బుధ గ్రహాల అనుగ్రహం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. లాభ దాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఎటు వంటి ప్రయత్నమైనా నెరవేరుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.  వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

శుక్ర, కుజ, రవుల అనుకూలత ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపో తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశిలో శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల ఏ రంగంలో ఉన్నా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలను పట్టుదలగా పూర్తి చేయడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికా రుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.

Follow Us