AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ‘సూర్య’ ప్రతాపం.. సూపర్‌ సెంచరీతో చెలరేగిన ‘మిస్టర్‌ 360’ ప్లేయర్‌.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే?

ఇన్నింగ్స్‌ ఆద్యంతం ధాటిగా ఆడిన మిస్టర్‌ 360 ప్లేయర్‌ కేవలం 55 బంతుల్లోనే మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. సూర్యకు తోడు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది.

IND vs SA: 'సూర్య' ప్రతాపం.. సూపర్‌ సెంచరీతో చెలరేగిన 'మిస్టర్‌ 360' ప్లేయర్‌.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే?
Suryakumar Yadav
Basha Shek
|

Updated on: Dec 14, 2023 | 11:13 PM

Share

టీమిండియా టీ20 స్పెషలిస్ట్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ మళ్లీ రెచ్చిపోయాడు. గురువారం (డిసెంబర్‌ 14) జోహన్నెస్‌బర్గ్‌ వాండరర్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్‌ ఆద్యంతం ధాటిగా ఆడిన మిస్టర్‌ 360 ప్లేయర్‌ కేవలం 55 బంతుల్లోనే మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. సూర్యకు తోడు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్‌ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 12 పరుగుల వద్ద అవుటవ్వగా, తిలక్ వర్మ సున్నాకి అవుటయ్యాడు. ఈ దశలో యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా జైస్వాల్ దూకుడగా ఆడాడు. కేవలం 41 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. మొదట నెమ్మదిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా కేవలం 55 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో మెరుపు సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీ సాధించిన రోహిత్ శర్మ రికార్డును సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. టీ20 క్రికెట్‌లో హిట్‌మన్ 4 సెంచరీలు చేశాడు.

ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా టీ20 క్రికెట్‌లో 4 సెంచరీలు చేయడం ద్వారా రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును సమం చేశాడు. అంతే కాకుండా అతి తక్కువ టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. గ్లెన్ మాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల ద్వారా 4 టీ20 సెంచరీలు చేశాడు. ఇప్పుడు సీడీసీ సూర్యకుమార్ యాదవ్ కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే 4 అద్భుత సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సూర్యకుమార్ యాదవ్ (100) సెంచరీతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 202 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా దక్షిణాఫ్రికాపై సూర్యకుమార్ కు ఇదే తొలి సెంచరీ. విశేషమేమిటంటే అతని ఈ సెంచరీలన్నీ వివిధ దేశాల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా మరియు దక్షిణాఫ్రికా) వచ్చాయి. 56 బంతుల్లో (8 సిక్సర్లు, 7 ఫోర్లు) 100 పరుగులు చేసి ఔటయ్యాడు సూర్య.

ఇవి కూడా చదవండి

 దక్షిణాఫ్రికా ఎదుట భారీ టార్గెట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. ప్రత్యేకతలివే..
భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. ప్రత్యేకతలివే..
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి