RGV Vyuham: ఆర్జీవీ ‘వ్యూహం’ వచ్చేస్తోంది.. సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం సినిమాను మొదట నవంబర్ 10న విడుదల చేయాలని భావించారు డైరెక్టర్ వర్మ. అయితే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూహం సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. సీఎం జగన్ పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ కనిపించనున్నాడు. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస నటించింది. రామ దూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ పొలిటికల్ మూవీని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం సినిమాను మొదట నవంబర్ 10న విడుదల చేయాలని భావించారు డైరెక్టర్ వర్మ. అయితే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూహం సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాశారు. దీంతో వ్యూహం సినిమా విడుదలకు అడ్డుకట్ట పడింది. అయితే లేటెస్ట్గా వ్యూహం సినిమా రిలీజ్కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈవిషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు రామ్ గోపాల్ వరర్మ. వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను చూపిస్తూ ‘ బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్. ‘డిసెంబర్ 29న వ్యూహం సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇదుగో సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్’ అని రాసుకొచ్చాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వర్మ అభిమానులు, సీఎం ఫ్యాన్స్, వైసీసీ నేతలు, కార్యకర్తలు తెగ ఖుషీ అవుతున్నారు.
కాగా సీఎం జగన్ జీవిత కథను మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రెండో భాగం శపథం ను జనవరి 25న విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారాయన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ ఫ్యామిలీకి ఎదురైన గడ్డు పరిస్థితులు, ఓదార్పు యాత్ర, క్రిమినల్ కేసులు, జైలు జీవితం తదితర అంశాలను వర్మ తన వ్యూహం సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తండ్రి మరణం తర్వాత తనకు ఎదురైన గడ్డు పరిస్థితులను సీఎం జగన్ అధిగమించిన తీరు, ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానాన్ని శపథం సినిమాలో వర్మ ఆవిష్కరించనున్నట్లు సమాచారం. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి రిలీజుకు ముందే వార్తల్లో నిలిచిన వ్యూహం థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్..
BAD NEWS for BAD GUYS 💪
VYUHAM censor CERTIFICATE 🙌
DECEMBER 29 th in THEATRES 😌 pic.twitter.com/LBBKAt977s
— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..