AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ జర్నీ వీడియో ఎఫెక్ట్‌.. అమర్‌ దీప్‌కు భారీగా ఓట్లు.. టాప్‌-3లో ఉన్నది వీరే

ఫినాలే వీక్‌లో భాగంగా మంగళవారం(డిసెంబర్‌ 12) టాప్‌- 6 కంటెస్టెంట్స్‌కు సంబంధించిన బిగ్‌ బాస్ జర్నీ వీడియోలను చూపించాడు బిగ్‌బాస్‌. అమర్‌ దీప్‌, అలాగే అంబటి అర్జున్‌, శివాజీల బిగ్ బాస్‌ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవి ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ జర్నీ వీడియో ఎఫెక్ట్‌.. అమర్‌ దీప్‌కు భారీగా ఓట్లు.. టాప్‌-3లో ఉన్నది వీరే
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Dec 12, 2023 | 10:08 PM

Share

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ 7 ఆఖరి అంకానికి చేరుకుంది. సుమారు 14 వారాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షోకు మరికొన్ని రోజుల్లో ముగింపు కార్డు పడనుంది. ఆదివారం (డిసెంబర్‌ 17) బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే నిర్వహించనున్నారు. 14 వారంలో శోభా శెట్టి ఎలిమినేట్‌ కగా మిగిలిన ఆరు కంటెస్టెంట్స్‌ గ్రాండ్‌ ఫినాలేకు దూసుకెళ్లారు. అంబటి అర్జున్‌ అందరి కంటే ముందు ఫినాలే టిక్కెట్ సొంతం చేసుకోగా.. ప్రియాంక జైన్‌ సెకెండ్‌ ఫైనలిస్టుగా కన్ఫర్మ్‌ అయ్యింది. వీరితో పాటు పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్‌, ప్రిన్స్‌ యావర్‌ బిగ్‌ బాస్‌ టైటిల్‌ రేసులో ఉన్నారు. వీరికి ఓటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఫినాలే వీక్‌లో భాగంగా మంగళవారం(డిసెంబర్‌ 12) టాప్‌- 6 కంటెస్టెంట్స్‌కు సంబంధించిన బిగ్‌ బాస్ జర్నీ వీడియోలను చూపించాడు బిగ్‌బాస్‌. అమర్‌ దీప్‌, అలాగే అంబటి అర్జున్‌, శివాజీల బిగ్ బాస్‌ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవి ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఓటింగ్‌ కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా టైటిల్‌ ఫేవరేట్లలో ఒకరైన అమర్‌ దీప్‌కు భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈరోజు వరకు నమోదైన ఓటింగ్‌ చూస్తుంటే.. ఎప్పటి లాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. బిగ్‌ బాస్‌ చాణక్యుడు, పెద్దన్న శివాజీ రెండో స్థానంలో ఉన్నాడు. బిగ్‌ బాస్‌ జర్నీల వీడియోల ఎఫెక్టేమో అమర్‌ దీప్‌ కు భారీగా ఓట్లు పడుతున్నాయి. దీంతో నాలుగో స్థానంలో ఉన్న అతను ఏకంగా మూడో స్థానానికి వచ్చేశాడు. ఇదే ప్లేస్‌లో ఉన్న ప్రిన్స్‌ యావర్‌ నాలుగో స్థానానికి పడిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఇక బిగ్‌ బాస్‌ ఓటింగ్‌లో అంబటి అర్జున్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆరో స్థానంలో కన్నడ ముద్దుగుమ్మ ప్రియాంక జైన్‌ ఉంది. బిగ్‌ బాస్‌ ఓటింగ్‌ ముగియడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. మరి ఈ మూడు రోజుల్లో ఈ ఓటింగ్ ఏమైనా మారుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఓటింగ్‌ సరళిని చూస్తుంటే పల్లవి ప్రశాంత్ లేదా శివాజీ ఇద్దరిలో ఒకరు బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగనీ అమర్ దీప్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. అతనికి ఈరోజు భారీగా ఓట్లు పడ్డాయి. మరీ ముఖ్యంగా హాట్‌ స్టార్‌ ఓటింగ్‌లో అమర్ దీప్‌ టాప్‌లో దూసుకెళుతున్నాడు.

 బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?