Geetha Madhuri: మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌.. గుడ్ న్యూస్‌ చెప్పిన గీతా మాధురి దంపతులు

తమ ప్రేమ, అన్యోన్యత బంధానికి గుర్తింపుగా 2019లో గీతా మాధురి- నందు దంపతులకు దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. ఇప్పుడీ లవ్లీ కపుల్‌ మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నారు. త్వరలోనే మరొక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు తాము మరోసారి పేరెంట్స్‌ కానున్నామంటూ సోషల్ మీడియా వేదికగా శుభ వార్తను పంచుకున్నారు గీత- నందు.

Geetha Madhuri: మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌.. గుడ్ న్యూస్‌ చెప్పిన గీతా మాధురి దంపతులు
Geetha Madhuri Family
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2023 | 5:00 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ లవబుల్‌ కపుల్స్‌లో గీతా మాధురి- నందుల జోడీ ఒకటి. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యో్న్యంగా ఉంటారు. సందర్భమొచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటారు. ఆ మధ్యన వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు వస్తే నవ్వుకుని తమ ప్రేమ బంధాన్ని చాటుకున్నారు. ఈ ప్రేమ, అన్యోన్యత బంధానికి గుర్తింపుగానే 2019లో గీతా మాధురి- నందు దంపతులకు దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. ఇప్పుడీ లవ్లీ కపుల్‌ మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నారు. త్వరలోనే మరొక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు తాము మరోసారి పేరెంట్స్‌ కానున్నామంటూ సోషల్ మీడియా వేదికగా శుభ వార్తను పంచుకున్నారు గీత- నందు. ఈ మేరకు భర్త నందు, కూతురు దాక్షాయణిలతో కలిసున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన గీతా మాధురి ‘ దాక్షాయని ప్రకృతి క్యూట్‌ అక్క కాబోతుంది. అది కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే’ అని రాసుకొచ్చింది. తద్వారా తాను మళ్లీ గర్భం దాల్చానని చెప్పకనే చెప్పిందీ స్టార్‌ సింగర్‌. ప్రస్తుతం గీత- నందుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్‌ చూసిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

ఓవైపు కూతురి ఆలనాపాలనా చూసుకుంటూనే సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది గీతా మాధురి. ట్యాలెంటెడ్‌ సింగర్‌గా పలు అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే బిగ్‌ బాస్‌ రియాలిటీ షోలోనూ సందడి చేసింది. ప్రస్తుతం పలు టీవీ షోల్లోనూ కనిపిస్తోంది. మరోవైపు నందు హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నాడు. ఇటీవల నందు నటించిన మ్యాన్షన్‌ 24, వధువు వెబ్‌ సిరీస్‌లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మధ్యన క్రికెట్‌ కామెంటేటర్‌, యాంకర్‌గానూ సరికొత్త అవతారమెత్తాడీ హ్యాండ్సమ్‌ యాక్టర్‌. ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో రెండో బిడ్డ కోసం ప్లాన్‌ చేస్తున్నట్లు కూడా చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని గీతా మాధురి ధ్రువీకరించింది.

ఇవి కూడా చదవండి

గీతా మాధురి- నందుల పోస్ట్..

గీతా- నందుల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

గీతా- నందు దంపతుల కూతురు దాక్షాయణి ప్రకృతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.