IND vs SA: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో తండ్రి.. సౌతాఫ్రికాతో వన్డేలకు కూడా దూరమైన స్టార్‌ ప్లేయర్‌

దక్షిణాఫ్రికాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమిండియా పేసర్ దీపక్ చాహర్ దూరం అయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా మైదానానికి దూరంగా ఉన్న దీపక్.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లకు ఎంపికయ్యాడు. అయితే తండ్రి అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికా వెళ్లలేదు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

IND vs SA: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో తండ్రి.. సౌతాఫ్రికాతో వన్డేలకు కూడా దూరమైన స్టార్‌ ప్లేయర్‌
Deepak Chahar
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2023 | 6:42 AM

దక్షిణాఫ్రికాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమిండియా పేసర్ దీపక్ చాహర్ దూరం అయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా మైదానానికి దూరంగా ఉన్న దీపక్.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లకు ఎంపికయ్యాడు. అయితే తండ్రి అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికా వెళ్లలేదు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు వన్డే సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఇప్పటికే డర్బన్‌లో ఉన్న భారత జట్టులో దీపక్ చాహర్ ఇంకా చేరలేదు. అతని తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అతని కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని బట్టి అతను జట్టులో చేరవచ్చు లేదా చేరకపోవచ్చు” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, దీనికి ముందు దీపక్ చాహర్ భారత జట్టులోకి రావడం అనుమానమే. ‘నాకు మా నాన్న చాలా ముఖ్యం. నన్ను ఇంత గొప్ప ఆటగానిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర మరువలేదని. ప్రస్తుత పరిస్థితుల్లో నాన్నను వదిలి ఎక్కడికీ వెళ్లలేను’ అని కొద్ది రోజుల క్రితం దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు.

ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్ గురించి అడిగినప్పుడు, భారత జట్టులో తన చేరిక నాన్న ఆరోగ్యంపై ఆధారపడి ఉందని క్లారిటీ ఇచ్చాడు. ‘ దక్షిణా ఫ్రికా పర్యటన మా నాన్న ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆయనను విడిచిపెట్టలేను’ అని చెప్పాడు. దీంతో దీపక్ చాహర్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ టూర్‌లో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లతో పాటు భారత్‌ ఎ జట్టు మూడు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది, ఇందులో చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది.

ఇవి కూడా చదవండి

తండ్రితో దీపక్ చాహర్..

భారత వన్డే జట్టు:

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్ చాహర్.

టీ20 సిరీస్ షెడ్యూల్:

డిసెంబర్ 10- మొదటి T20 మ్యాచ్ (డర్బన్) డిసెంబర్ 12- రెండవ T20 మ్యాచ్ (గెబర్హా) డిసెంబర్ 14- మూడో టీ20 మ్యాచ్ (జోహన్నెస్‌బర్గ్)

వన్డే సిరీస్ షెడ్యూల్:

డిసెంబర్ 17- మొదటి వన్డే (జోహన్నెస్‌బర్గ్) డిసెంబర్ 19- రెండవ ODI (గెబర్హా) డిసెంబర్ 21 – మూడవ ODI (పార్ల్)

టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

డిసెంబర్ 26 నుండి – మొదటి టెస్ట్ (సెంచూరియన్) జనవరి 3 నుండి – రెండవ టెస్ట్ (కేప్ టౌన్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..