AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఓట్లు పడకుండా రైతు బిడ్డపై కుట్ర.. పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నంబర్.. వీడియోతో బట్టబయలు

ప్రస్తుతమున్న ట్రెండ్‌ చూస్తుంటే రైతు బిడ్డ పల్లవి ప్రశాంతే బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలవచ్చని తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ అతని పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఓటింగ్‌లోనూ రైతు బిడ్డదే అగ్రస్థానం. శివాజీని మంచి ఓట్‌ షేరింగ్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రశాంత్. గుంప గుత్తగా అతనికి ఓట్లు పడుతున్నాయి.

Bigg Boss 7 Telugu: ఓట్లు పడకుండా రైతు బిడ్డపై కుట్ర.. పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నంబర్.. వీడియోతో బట్టబయలు
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Dec 09, 2023 | 9:51 PM

Share

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ తుది అంకానికి వచ్చేసింది. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌గా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్‌ షో తాజా సీజ్‌ను కూడా త్వరలోనే శుభం కార్డు పడనుంది. డిసెంబర్‌ 17న గ్రాండ్‌ ఫినాలే జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే హౌజ్‌లో ఫినాలే టాస్కులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే ఫినాలే విన్నర్‌ పేరుతో ఓటింగ్‌ను కూడా షురూ చేశారు. దీని ప్రకారమే 14వ వారం ఎలిమినేషన్‌తో పాటు బిగ్‌ బాస్ టైటిల్‌ విన్నర్‌ను డిసైడ్‌ చేయనున్నారు. ప్రస్తుతమున్న ట్రెండ్‌ చూస్తుంటే రైతు బిడ్డ పల్లవి ప్రశాంతే బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలవచ్చని తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ అతని పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఓటింగ్‌లోనూ రైతు బిడ్డదే అగ్రస్థానం. శివాజీని మంచి ఓట్‌ షేరింగ్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రశాంత్. గుంప గుత్తగా అతనికి ఓట్లు పడుతున్నాయి. అయితే ఓటింగ్‌ కోసం పల్లవి ప్రశాంత్‌కు కేటాయించిన ఫోన్‌ నంబర్‌ గత రెండు రోజులుగా పని చేయడం లేదు. రైతు బిడ్డకు ఓట్లు పడకుండా బిగ్‌ బాస్‌ కుట్ర చేశాడంటూ అతని ఫ్యా్న్స్‌ గగ్గోలు పెడుతున్నారు. కావాలనే పల్లవి ప్రశాంత్ నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టారని, అదే సమయంలో అమర్‌ దీప్‌ కు కాల్‌ చేస్తుంటే మాత్రం వెంటనే కలుస్తుందంటూ ఒక వీడియోను షేర్‌ చేశారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఓటింగ్‌ కోసం పల్లవి ప్రశాంత్‌కి 8886676905 అనే నెంబర్‌ని కేటాయించారు బిగ్‌ బాస్‌ యాజమాన్యం. ఈ నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా రైతుబిడ్డకు ఓటేయొచ్చు. కానీ ప్రస్తుతం ఈ నెంబర్‌కి కాల్ చేస్తుంటే.. రింగ్ కావడం లేదు. జస్ట్‌ హోల్డ్‌లో ఉన్నట్టుగా సౌండ్ మాత్రమే వస్తుంది. అదే సమయంలో మిగిలిన కంటెస్టెంట్స్‌ నెంబర్లకు ట్రై చేస్తే మాత్రం అందరి నెంబర్లు వెంటనే రింగ్ అవుతున్నాయి. దీంతో పల్లవి ప్రశాంత్‌ను ఓడిపించేందుకు కుట్ర జరుగుతున్నట్లు రైతు బిడ్డ ఫ్యాన్స ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని హోస్ట్‌ నాగార్జున దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మరి రైతు బిడ్డ ఫోన్‌ నంబర్‌ విషయంలో నిజంగానే కుట్ర జరిగిందా? లేక టెక్నికల్‌ ప్రాబ్లమా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఫోన్‌ నంబర్‌ పనిచేయకపోయినా ప్రస్తుతం సుమారు 41 శాతం ఓట్లతో అగ్రస్థానంలో దూసుకెళుతున్నాడు పల్లవి ప్రశాంత్‌.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదుగో..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..