Year Ender 2023: ఈ ఏడాదిలో క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ఆటగాళ్లు వీరే.. టీమిండియా ప్లేయర్స్‌ ఎవరున్నారంటే?

ఈ ఏడాది చాలా మంది ఆటగాళ్లు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కొందరు వన్డేలకు గుడ్‌ బై చెబితే, మరికొందరు టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇంకొందరు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. అలా 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం రండి.

Year Ender 2023: ఈ ఏడాదిలో క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ఆటగాళ్లు వీరే.. టీమిండియా ప్లేయర్స్‌ ఎవరున్నారంటే?
Naveen Ul Haq, Quinton De Kock
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2023 | 6:37 PM

మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. 2024 కు స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. క్రికెట్‌ అభిమానులకు 2023 సంవత్సరం బాగా గుర్తుండిపోతుంది. వరల్డ్‌ కఫ్‌ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడం ఈ ఏడాది అత్యంత చేదు జ్ఞాపకమని చెప్పుకోవచ్చు. ఈ సంగతి పక్కన పెడితే ఈ ఏడాది చాలా మంది ఆటగాళ్లు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కొందరు వన్డేలకు గుడ్‌ బై చెబితే, మరికొందరు టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇంకొందరు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. అలా 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం రండి.

ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్ ప్రిటోరియస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనితో పాటు లెజెండరీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను అంతకు ముందే అంతర్జాతీయ క్రికెట్‌ను విడిచిపెట్టాడు. అయితే ఈ సంవత్సరం అతను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌ బై చెప్పేశాడు. 2007లో టీమిండియాను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిపిన జోగిందర్ శర్మ కూడా ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ-20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేసి మిస్బా ఉల్‌ హక్‌ వికెట్‌ పడగొట్టాడీ బౌలర్‌. జోగిందర్ శర్మతో పాటు మురళీ విజయ్, మనోజ్ తివారీ, అంబటి రాయుడు ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించారు. విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు T20 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీ కూడా ఈ సంవత్సరం క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశారు. మొయిన్ అలీ యాషెస్ ఆడేందుకు తన రిటైర్మెంట్‌ను కూడా వెనక్కి తీసుకున్నాడు. అయితే యాషెస్ తర్వాత అతను మళ్లీ రిటైరయ్యాడు.

ఇవి కూడా చదవండి

జోగిందర్ శర్మ.. కూడా

ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌ సమయంలో చాలా మంది ఆటగాళ్ళు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ కేవలం 24 సంవత్సరాల వయస్సులో వన్డేల నుండి రిటైర్ అయ్యి షాక్‌ ఇచ్చాడు. అతనితో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ కూడా ప్రపంచ కప్ తర్వాత రిటైరయ్యారు.

ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పేసిన రాయుడు..

View this post on Instagram

A post shared by Ambati Rayudu (@a.t.rayudu)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..