AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఓటింగ్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. డేంజర్‌ జోన్‌లోకి శివాజీ బ్యాచ్‌ మేట్‌.. శోభ మళ్లీ సేఫ్‌

డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగవచ్చునని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టు గానే హౌజ్‌లోనూ ఫినాలే టాస్కులు ప్రారంభమయ్యాయి. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ అంబటి అర్జున్‌ ఏకంగా ఫినాలేలోకి దూసుకెళ్లిపోయాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈ వారం ఎలిమినేషన్‌పైనే ఉంది. 14వ వారంలో మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు.

Bigg Boss 7 Telugu: ఓటింగ్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. డేంజర్‌ జోన్‌లోకి శివాజీ బ్యాచ్‌ మేట్‌.. శోభ మళ్లీ సేఫ్‌
Bigg Boss Telugu 7
Basha Shek
|

Updated on: Dec 07, 2023 | 10:06 PM

Share

ఉల్టా పుల్టా సీజన్‌ అంటూ బుల్లితెర ఆడియెన్స్‌ను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ సెలబ్రిటీ రియాలిటీ షోకు తెరపడనుంది. డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగవచ్చునని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టు గానే హౌజ్‌లోనూ ఫినాలే టాస్కులు ప్రారంభమయ్యాయి. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ అంబటి అర్జున్‌ ఏకంగా ఫినాలేలోకి దూసుకెళ్లిపోయాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈ వారం ఎలిమినేషన్‌పైనే ఉంది. 14వ వారంలో మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్, శోభా శెట్టి నామినేషన్స్‌ జాబితాలో ఉన్నారు. అంబటి అర్జున్‌ ఎలాగో ఇప్పటికే ఫినాలేలోకి వెళ్లిపోయాడు కాబట్టి ఎలిమినేషన్‌లోకి రాడు. ఇక నామినేషన్స్‌లోకి ఉన్న వాళ్లకి ఓటింగ్‌ కూడా రసవత్తరంగా సాగుతోంది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండడంతో భారీగా ఓటింగ్‌ నమోదవుతున్నాయి. ఇక ఫినాలే కావడంతో అంబటి అర్జున్‌ను కూడా ఓటింగ్‌లోకి చేర్చారు. ఒక ఓటింగ్‌ విషయానికొస్తే.. ఎప్పటి లాగే 14వ వారంలో కూడా శివాజీ బ్యాచ్‌ దే ఆధిపత్యం కొనసాగుతోంది. కామన్‌ మ్యాన్‌, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి సుమారు 39 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక ఆ తర్వాతి ప్లేస్‌లో శివాజీ ఉన్నాడు. అతనికి 18 శాతం మంది ఓట్లేశారు.

అయితే నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న ప్రిన్స్‌ యావర్‌ ఇప్పుడు అనూహ్యంగా కిందికి దిగిపోయాడు. అతని స్థానంలో సీరియల్‌ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌ దీప్‌ వచ్చేశాడు. 17.89 శాతం ఓట్లతో అమర్‌ మూడో ప్లేస్‌లో ఉండగా, 17. 59 శాతం ఓట్లతో ప్రిన్స్‌ యావర్‌ నాలుగో ప్లేస్‌కు పడిపోయాడు. ఇక ఎప్పటిలాగే ప్రియాంక జైన్‌, శోభా శెట్టి చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అంటే ఇప్పుడు ప్రియాంక, శోభలతో పాటు ప్రిన్స్‌ యావర్‌ కూడా డేంజర్‌ జోన్‌లోకి వచ్చినట్లే. దీనికి తోడు శోభను సేవ్‌ చేసేందుకు ప్రిన్స్‌ యావర్‌ను ఎలిమినేట్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం (డిసెంబర్‌ 8 ) రాత్రి వరకు ఓటింగ్‌కు సమయముంది. మరి ఇదే ట్రెండ్‌ కొనసాగితే ప్రిన్స్‌ యావర్‌ డేంజర్‌లో పడినట్లే. చూడాలి మరి ఏం జరగుతుందో..

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో శోభా శెట్టి..

శోభకు మద్దతుగా వర్షిణీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!
ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!
అప్పుడు NTR, ఇప్పుడు విజయ్‌! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..
అప్పుడు NTR, ఇప్పుడు విజయ్‌! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..
ఈ టాప్ కమెడియన్‌ను గుర్తు పట్టారా? ఒకప్పుడు పాన్,పెన్నులు అమ్మి..
ఈ టాప్ కమెడియన్‌ను గుర్తు పట్టారా? ఒకప్పుడు పాన్,పెన్నులు అమ్మి..
పీతలు, రొయ్యలతో పాపడ్‌ తయారీ ట్రెండింగ్‌..ఒక్క పీస్‌ ఖరీదు రూ.900
పీతలు, రొయ్యలతో పాపడ్‌ తయారీ ట్రెండింగ్‌..ఒక్క పీస్‌ ఖరీదు రూ.900
రఘువరన్ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
రఘువరన్ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఆరు నెలలుగా తగ్గని కడుపు ఉబ్బరం.. కట్ చేస్తే..
ఆరు నెలలుగా తగ్గని కడుపు ఉబ్బరం.. కట్ చేస్తే..
శరీర వేడిని తరిమికొట్టి నిమిషాల్లో ఇమ్యూనిటీని పెంచే డ్రింక్..
శరీర వేడిని తరిమికొట్టి నిమిషాల్లో ఇమ్యూనిటీని పెంచే డ్రింక్..
సీఎంగా దళపతి.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
సీఎంగా దళపతి.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
NCRTC లో ఉద్యోగాల జాతర..నెలకు రూ. 2 లక్షల జీతం పొందే సువర్ణావకాశం
NCRTC లో ఉద్యోగాల జాతర..నెలకు రూ. 2 లక్షల జీతం పొందే సువర్ణావకాశం
విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే...
విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే...