AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికేసిన అమర్‌దీప్‌.. పిచ్చోడిని చేయాలనుకుంటున్నాడంటూ కేకలు.. ప్రోమో చూశారా ?..

తమకు ఇచ్చిన జాకెట్ ధరించి.. స్టార్ట్ బజర్ రాగనే మిగతా వారి జాకెట్ పైకి బాల్స్ విసిరాల్సి ఉంటుంది. బజర్ మోగేసరికి ఎవరి జాకెట్ కు ఎక్కువ బాల్స్ ఉంటాయో వారు టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‏బాస్. అయితే ఇందులో ముందుగా శోభా, యావర్ ఇద్దరు అవుట్ అయినట్లుగా చెప్పాడు బిగ్‏బాస్. ఇక ఆ తర్వాత మరోసారి గేమ్ స్టార్ట్ కాగా.. ముందుగా బాల్స్ పట్టుకుని ప్రశాంత్ మీదకు వెళ్లాడు అమర్. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికేసిన అమర్‌దీప్‌.. పిచ్చోడిని చేయాలనుకుంటున్నాడంటూ కేకలు.. ప్రోమో చూశారా ?..
Bigg Boss 7 Telugu
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2023 | 7:12 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. అయినా ఇప్పటికీ కంటెస్టెంట్స్ మాత్రం గొడవ పడుతూనే ఉన్నారు. మొదటి నుంచి బద్ద శత్రువులు ప్రవర్తించిన అమర్, ప్రశాంత్..గత మూడు వారాలు మాత్రం మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అన్నదమ్ముల్లుగా కలిసిపోయి గేమ్ ఆడారు. కానీ గత వారం నుంచి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ స్టార్ట్ అయ్యింది. తనకు కెప్టెన్ అయ్యేందుకు సహకరించిన ప్రశాంత్‏ను నమ్మించి నామినేట్ చేశాడు అమర్. దీంతో అప్పటి నుంచి వీరి మధ్య మళ్లీ వివాదం మొదలైంది. నువ్వా నేనా అంటూ వీళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే మాటలు కాదు.. కొట్టుకున్నారు. ప్రశాంత్, అమర్ మధ్య ఫిజికల్ అటాక్ జరిగింది. అంతేకాదు అమర్ దీప్ పిచ్చిపట్టినట్లుగా బిహేవ్ చేశాడు.

ప్రోమోలో.. తమకు ఇచ్చిన జాకెట్ ధరించి.. స్టార్ట్ బజర్ రాగనే మిగతా వారి జాకెట్ పైకి బాల్స్ విసిరాల్సి ఉంటుంది. బజర్ మోగేసరికి ఎవరి జాకెట్ కు ఎక్కువ బాల్స్ ఉంటాయో వారు టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‏బాస్. అయితే ఇందులో ముందుగా శోభా, యావర్ ఇద్దరు అవుట్ అయినట్లుగా చెప్పాడు బిగ్‏బాస్. ఇక ఆ తర్వాత మరోసారి గేమ్ స్టార్ట్ కాగా.. ముందుగా బాల్స్ పట్టుకుని ప్రశాంత్ మీదకు వెళ్లాడు అమర్. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో అమర్ తనను కొరికాడంటూ ప్రశాంత్ సంచాలక్ శోభాకు కంప్లైంట్ చేశాడు. నేను తప్పు చేశానని ఒప్పుకుంటా.. నేను చేసేవి కనిపిస్తాయి. నువ్వు చేసేవి కనిపించవు అంటూ అరుస్తూ రెచ్చిపోయాడు అమర్. నువ్వు చేసేది తప్పు అంటూ ప్రశాంత్ అనడంతో .. కొట్టేందుకు రెడీ అయినట్లు చూపించాడు అమర్.

ప్రశాంత్ ముసుగులాట ఆడుతున్నాడని.. డబుల్ గేమ్ ఆడుతున్నాడని.. నేనే అబద్ధం.. వాడే నిజం సరేనా అంటూ రెచ్చిపోయాడు. వేరేవాళ్లతో ప్రశాంత్ చెప్పిన మాటను బయటపెట్టనని మాటిచ్చానని శివాజీతో అన్నాడు. నిజం బయటపెట్టడం లేదని.. వేరేవాళ్లతో చెప్పిన మాట బయటపెట్టనని అంటూ అరిచాడు. పిచ్చొడిగా చూపించాలనుకుంటున్నాడు.. రెచ్చగొట్టకు అంటూ అరుస్తుండగా.. ఇద్దరిని ఆగాలంటూ సీరియస్ అయ్యాడు అర్జున్. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్‏లో అమర్ దీప్, ప్రశాంత్ మధ్య ఫిజికల్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?