AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP WDCW Jobs 2026: ఏపీ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. అమ్మాయిలకు భలే ఛాన్స్! రాత పరీక్ష లేదు

రాష్ట్ర ప్రభుత్వ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని వన్ స్టాప్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద..

AP WDCW Jobs 2026: ఏపీ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. అమ్మాయిలకు భలే ఛాన్స్! రాత పరీక్ష లేదు
AP WDCW Srikakulam Recruitment
Srilakshmi C
|

Updated on: Mar 04, 2026 | 3:18 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని వన్ స్టాప్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 13 సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సైకో సోషల్ కౌన్సిలర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్/లాయర్, పారా మెడికల్ పర్సనల్, ఆఫీస్ అసిస్టెంట్ (కంప్యూటర్ నాలెడ్జ్) తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 13, 2026వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల సంఖ్య: 1
  • సైకో సోషల్ కౌన్సిలర్ పోస్టుల సంఖ్య: 1
  • కేస్ వర్కర్ పోస్టుల సంఖ్య: 2
  • పారా లీగల్ పర్సనల్/లాయర్ పోస్టుల సంఖ్య: 1
  • పారా మెడికల్ పర్సనల్ పోస్టుల సంఖ్య: 1
  • ఆఫీస్ అసిస్టెంట్ (కంప్యూటర్ నాలెడ్జ్) పోస్టుల సంఖ్య: 1
  • సెక్యూరిటీ/నైట్ గార్డ్ పోస్టుల సంఖ్య: 3
  • మల్టీపర్పస్ స్టాఫ్/వంట మనిషి పోస్టుల సంఖ్య: 3

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును బట్టి లా/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ సైకాలజీ విభాగల్లో డిప్లొమా/ డిగ్రీ/ పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఉద్యోగానుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ కింది అడ్రస్‌లో మార్చి 13, 2026వ తేదీలోపు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.13,000 నుంచి రూ.34,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్..

జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయం, శ్రీకాకుళం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us