Brahmamudi, December 8th episode: తికమక పెట్టిన పంతులు.. చిర్రుబుర్రులాడిన కనకం! మొక్క బతుకుతుందా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉందని చెబుతాడు పంతులు గారు. దీంతో ఇంట్లోని సభ్యులు ఖంగు తింటారు. మరి ఏం చేయాలని పెద్దావిడ అడిగితే.. ఈ ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య రీత్యా చిక్కులు.. చికాకులు రావచ్చు. ఆ జంట కాపురం కూడా సజావుగా జరగదని పంతులు చెప్తారు. మాంగళ్య దోషం పోవాలంటే.. హోం జరిపించాలి. ఆ తర్వాత ఓ నిమ్మ మొక్క తీసుకొచ్చి.. నాటాలి. తెల్లవారే సరికి ఆ మొక్క పచ్చగా ఉండి బతికితే.. పెళ్లి జరిపించవచ్చు. లేదంటే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉందని చెబుతాడు పంతులు గారు. దీంతో ఇంట్లోని సభ్యులు ఖంగు తింటారు. మరి ఏం చేయాలని పెద్దావిడ అడిగితే.. ఈ ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య రీత్యా చిక్కులు.. చికాకులు రావచ్చు. ఆ జంట కాపురం కూడా సజావుగా జరగదని పంతులు చెప్తారు. మాంగళ్య దోషం పోవాలంటే.. హోం జరిపించాలి. ఆ తర్వాత ఓ నిమ్మ మొక్క తీసుకొచ్చి.. నాటాలి. తెల్లవారే సరికి ఆ మొక్క పచ్చగా ఉండి బతికితే.. పెళ్లి జరిపించవచ్చు. లేదంటే ఈ పెళ్లి ఆపేయాల్సిందే. ఒక వేళ పెళ్లి జరిగినా.. ఆ జంట విడిపోతారు అని చెప్తాడు పంతులు.
టెన్షన్ లో ధాన్య లక్ష్మి.. భోజనం దగ్గరి నుంచి లేచిన కళ్యాణ్..
ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఈ మాటలు ఆలోచిస్తూ కళ్యాణ్ ఆలోచనలో పడతాడు. రేయ్ తినకుండా ఏం ఆలోచిస్తున్నావ్ అని అపర్ణ అడుగుతుంది. ఇంకేముంది వదినా పంతులు గారు చెప్పిన దోషం గురించి అయి ఉంటుందని కనకం అంటుంది. అయితే దానికి పరిహారం కూడా పంతులు గారు చెప్పారు కదా అని పెద్దావిడ అంటే.. అంటే నిమ్మ మొక్క బతికితే ఓ లెక్క.. బతకకపోతే మరో లెక్క చెప్పారు కదా. అదే ఆలోచిస్తున్నారేమో అని కనకం అంటుంది. అవును.. కళ్యాణ్.. అనామికను ఇష్టపడ్డాడు కదా అని ఒప్పుకున్నా.. కానీ ఇలాంటి దోషం ఉంటే ఇంటి పెద్దకు గండం అన్నారు. వాళ్ల కాపురం కూడా నిలబడదు అన్నారు. ఇన్ని అనర్థాలు చూసే బదులు.. ఈ పెళ్లి ఆపేయడమే బెటర్ అనిపిస్తుందని ధాన్య లక్ష్మి అంటే.. అవునండి పెళ్లి అంటే నూరేళ్ల పంటలా ఉండాలి కానీ.. నట్టింట్లో మంటలా ఉంటే ఎలా.. అని కనకం కూడా అంటే.. ఆ మాటలకు కళ్యాణ్ భోజనం దగ్గర నుంచి వెళ్లి పోతాడు.
మేము హ్యాపీగా ఉన్నామన్న కావ్య.. షాక్ లో రుద్రాణి:
ఈ జాతకాలు అవీ ఇవీ నేను నమ్మను.. పెద్ద వాళ్ల నమ్మకం కోసం మాట్లాడలేదని రాజ్ అంటే.. ఏంటి కవి గారు ఇదీ.. మరి ఒకవేళ అదే నిజం అయితే నాకూ.. మీ అన్నయ్యకు జాతకాలు చూడకుండానే పెళ్లి జరిగి పోయింది కదా.. మేము ఇప్పుడు సంతోషంగానే ఉన్నామని కావ్య కూడా అంటుంది. మీరిద్దరూ సంతోషంగా ఉన్నారా.. ఇది ఎప్పుడు జరిగిందబ్బా అని రుద్రాణి అంటే.. ఏంటండి మీరేం మాట్లాడరు. అసలే మీ అత్తకు అనుమానాలు ఎక్కువ. నిజం చెప్పండి. మీరు నామీద చూపించే ప్రేమ గురించి చెప్పమని అంటుంది. కావ్య యాక్టింగ్ గురించి గుర్తుకు తెచ్చుకుని.. రాజ్ కూడా మరో రేంజ్ లో యాక్టింగ్ మొదలు పెడతాడు.
హనీమూర్ ప్యాకేజ్ కోసం ప్లాన్ కూడా చేస్తున్నాం: కావ్య
అవును రా.. మేము హ్యాపీగా ఉన్నాం.. నన్ను నమ్మరా.. అది మాకు మాత్రమే తెలుసురా.. అని రాజ్ అంటాడు. ఆ దోషం ఏదో పూర్తి చేస్తే సరిపోతుందని పెద్దావిడ, రుద్రాణి కూడా అంటారు. ఇంకో విషయం మీ అందరికీ చెప్తే మీరు షాక్ అవుతారు. మొన్న నాకు సడెన్ సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పారు కదా.. అది ఏంటంటే.. హనీమూన్ ప్యాకేజ్ ప్లాన్ చేశారు అని చెప్పగానే.. ఇంట్లో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు. అవునా అని రాజ్ కూడా అడుగుతాడు. రాజ్ వెకిలి నవ్వు నవ్వుతూ.. అవును అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కూర్చుని భోజనం చేస్తారు.
కావ్యపై విరుచుకుపడ్డ రాజ్:
ఈ సీన్ కట్ చేస్తే.. గదిలోకి రాగానే.. కావ్యపై కోపంతో ఊగిపోతాడు. ఏయ్ ఈ ఓవరాక్షనే వద్దు.. బయట ఏం అన్నావే నేను.. నిన్ను.. హనీ మూన్ కి తీసుకెళ్తానని చెప్పావా అని రాజ్ ఆవేశ పడతాడు. ఇక కావ్య కూడా మీరు ఆ మాట అనలేరని నాకు తెలుసండి.. ఈ జన్మకి మీరు అంతే.. నేను ఇంతే.. ఆ నిజాన్ని దిగమింగుకుని బ్రతికేస్తాను అని కావ్య అంటే.. అన్నీ తెలుసి కూడా నువ్వు ఎందుకే హనీమూన్ కి తీసుకెళ్తానని చెప్పావ్ అని రాజ్ అంటాడు. ఏం చేయమంటారు అండి.. మీరు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని.. తాతయ్య గారు అనుకోవాలని నేను చేసిన వెర్రి పని అండి అంటుంది. అలాగే తన స్టైల్ లో రాజ్ ని ఆడుకుంటుంది కావ్య. ఇక ఎప్పటి లాగే రాజ్ తిడుతూ ఉంటాడు. ఈ సీన్ కట్ చేస్తే.. తెల్లవారు అవుతుంది. స్వప్న రెడీ అవుతూ ఉంటుంది. కనకం వచ్చి ఏయ్ నువ్వేంటే రెడీ అవుతున్నావ్. అదేంటి అలా అంటున్నావ్.. ఇంట్లో పూజ ఉంది కదా.. ఈ మాత్రం కూడా రెడీ అవ్వకపోతే ఎలా అని స్వప్న అంటుంది. చాల్లే నీ డాబు.. ఆ పొగ వల్ల నీ కడుపులో బిడ్డకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ జ్యూస్ తాగి ఇక్కడే ఉండు అని కనకం చెప్తుంది.
నిమ్మ మొక్కలు తెచ్చిన అప్పూ.. టెన్షన్ లో అనామిక:
ఆ తర్వాత అప్పూ.. నిమ్మ మొక్కలు తీసుకుంటూ వస్తుంది. పంతులు ఒకటి చాలు అంటే మూడు కావాలి అని గొడవ పెట్టావ్.. మోయలేక చచ్చాను అని అప్పూ అంటే.. అప్పుడే వచ్చిన కళ్యాణ్ అవును మూడు ఎందుకు ఆంటీ.. ఒకటి చాలు కదా అని కనకం నీళ్లు నములుతూ అంటుంది. ఇక అప్పూ వెళ్తుంటే.. కళ్యాణ్ లోపలికి రమ్మంటాడు. సరే అని ఉంటుంది అప్పూ ఉంటుంది. ఆ తర్వాత హోమం మొదలవుతుంది. అనామిక, కళ్యాణ్ లను చూసిన అప్పూ మనసులో బాధ పడుతుంది. మరో వైపు ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరగాలని కళ్యాణ్, అనామికలు మనసులో కోరుకుంటారు. కళ్యాణ్ పెళ్లి బాగా జరగాలని.. అపర్ణ, సుభాష్ లు కోరుకుంటారు. ఆ తర్వాత అనామిక, కళ్యాణ్ లతో మొక్క నాటిస్తాడు పంతులు. ఆ నెక్ట్స్.. రేపు సూర్యోదయం వరకూ ఈ మొక్క పచ్చగా ఉంటే దోషం తొలగిపోయినట్టే.. లేదంటే పెళ్లి జరగదు అని చెప్పి వెళ్లి పోతాడు పంతులు. ఇక కనకం మాత్రం ఈ పెళ్లి జరగకూడదని మనసులో అనుకుంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.