Bigg Boss Vasanthi: పెళ్లి చేసుకోబోతున్న బిగ్‏బాస్ వాసంతి.. తిరుపతిలో నిశ్చితార్థం.. ఫోటోస్ వైరల్..

తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు. కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు. వాసంతి నిశ్చితార్థం వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గీతూ, అర్జున్ కళ్యామ్, సత్య, ఇనయ, ఆర్జే సూర్య సండది చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. వాసంతి..

Bigg Boss Vasanthi: పెళ్లి చేసుకోబోతున్న బిగ్‏బాస్ వాసంతి.. తిరుపతిలో నిశ్చితార్థం.. ఫోటోస్ వైరల్..
Vasanthi Krishnan
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2023 | 3:07 PM

బిగ్‏బాస్ బ్యూటీ.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈరోజు (డిసెంబర్ 8న) వాసంతి నిశ్చితార్థం ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్‏తో జరిగింది. తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు. కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు. వాసంతి నిశ్చితార్థం వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గీతూ, అర్జున్ కళ్యామ్, సత్య, ఇనయ, ఆర్జే సూర్య సండది చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. వాసంతి.. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‏గా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

వాసంతి కృష్ణన్.. తిరుపతికి చెందిన అమ్మాయి. మోడల్ గా కెరీర్ ఆరంభించి.. సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు సినిమాలో నటించింది. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాసంతికి సినిమా అవకాశాలు అంతగా రాలేదు. కానీ ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్లలో నటించి అలరించింది.

ఇక వాసంతికి కాబోయే భర్త పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నటుడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. నిజానికి వాసంతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఇప్పుడు ఆమెకు కాబోయే భర్త సైతం పవర్ స్టార్ వీరాభిమాని. అయితే ఇప్పటివరకు జనాలకు అంతగా పరిచయం లేని నటుడు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వాసంతితో నిశ్చితార్థం కావడంతో.. అసలు ఎవరీ పవన్ కళ్యాణ్ అని ఇన్ స్టాలో సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్.