AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

మారుతున్న అత్యాధునిక పోకడలు, మానవ తప్పిదాలు, పట్టణీకరణ, ఆక్రమణల వల్ల అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. మానవుల స్వార్థంతో అటవీ సంపద నాశనమవుతోంది. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల అనేక వన్యప్రాణుల జాతులు ఆవాసాలను కోల్పోతున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు.. జనావాసాలలోకి వస్తున్నాయి.

Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!
Man Shows Courage In Front Of Bengal Tiger T
Balaraju Goud
|

Updated on: Mar 04, 2026 | 5:32 PM

Share

మారుతున్న అత్యాధునిక పోకడలు, మానవ తప్పిదాలు, పట్టణీకరణ, ఆక్రమణల వల్ల అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. మానవుల స్వార్థంతో అటవీ సంపద నాశనమవుతోంది. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల అనేక వన్యప్రాణుల జాతులు ఆవాసాలను కోల్పోతున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు.. జనావాసాలలోకి వస్తున్నాయి. సాధారణంగా, అప్పుడప్పుడు వాటి చూసిన జనం భయాందోళనలకు గురవుతుంటారు. వన్య మృగాలను చూస్తే జనం పారిపోతారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అది ఆశ్చర్యం కలిగించడమే కాకుండా కొంత ఆలోచనను కూడా రేకెత్తిస్తోంది. ఒక క్రూరమైన బెంగాల్ టైగర్ అకస్మాత్తుగా మానవ నివాసంలోకి ప్రవేశించింది. ఆ తరువాతి దృశ్యం ప్రజలను దిగ్భ్రాంతికి, కలవరానికి గురి చేస్తుంది.

అడవి నుండి మానవ నివాస స్థలంలోకి ఒక బెంగాల్ టైగర్ వచ్చింది. దర్జాగా రోడ్డును దాటుతూ.. అటు ఇటు తిరుగుతూ కనిపించింది. దీనిని చూసిన కొంతమంది వీడియో చిత్రీకరించడం ప్రారంభించారు. అయితే, ఒక వ్యక్తి తాడుతో పులి వద్దకు వెళ్లి దాని మెడలో వేసి కుక్క పిల్ల మాదిరిగా తీసుకెళ్లాడు. ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, పులి అతనిపై దాడి చేయలేదు, బదులుగా నిశ్శబ్దంగా అతనితోపాటు వెళ్ళిపోయింది. బెంగాల్ టైగర్‌ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన మాంసాహారులలో ఒకటిగా పరిగణిస్తారు. కాబట్టి, అటువంటి దృశ్యాన్ని చూసి ఎవరు ఆశ్చర్యపోరు? ఈ వీడియో మెక్సికో లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @AnimalGeoLife అనే IDతో షేర్ చేయడం జరిగింది. ‘మెక్సికోలోని టెకీలాలో ఒక అద్భుతమైన దృశ్యం, ఒక బెంగాల్ టైగర్ నగరం చుట్టూ హాయిగా తిరుగుతోంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా దాన్ని ఇంటికి తీసుకెళ్లారు’ అని క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ 31 సెకన్ల వీడియోను 3,41,000 సార్లు వీక్షించారు, 6,000 మందికి పైగా దీనిని లైక్ చేసి వివిధ స్పందనలు తెలిపారు. ఒక వినియోగదారు, “అతను స్థానికుడు, “అది పెంపుడు పులి అయి ఉండాలి, అందుకే అది ఆ మనిషికి హాని కలిగించలేదని అన్నారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
మనుషుల మధ్య కుక్క పిల్లల్లా తిరుగుతున్న బెంగాల్ టైగర్!
మనుషుల మధ్య కుక్క పిల్లల్లా తిరుగుతున్న బెంగాల్ టైగర్!
జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం