Bigg Boss 7 Telugu: అమర్ దీప్ ఫ్యాన్స్ బూతులు.. నడి రోడ్డుపై కొడతానంటూ కీర్తి వార్నింగ్.. వీడియో
బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు.. ఇలా అన్ని భాషల బిగ్ బాస్ రియాలిటీ షోల్లోనూ ఈ తంతు కొనసాగుతుంటుంది. కంటెస్టెంట్ల మధ్య మాటలు తూలుతాయి. ఫిజికల్ టాస్కుల్లో తోసుకుంటారు. ఒక్కోసారి కొట్టుకునేదాకా కూడా వెళతారు. అయితే ఇదంతా ఒక ఆట. గొడవ పడిన హౌజ్ మేట్స్ అంతలోనే మళ్లీ కలిసి పోతారు
బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు.. ఇలా అన్ని భాషల బిగ్ బాస్ రియాలిటీ షోల్లోనూ ఈ తంతు కొనసాగుతుంటుంది. కంటెస్టెంట్ల మధ్య మాటలు తూలుతాయి. ఫిజికల్ టాస్కుల్లో తోసుకుంటారు. ఒక్కోసారి కొట్టుకునేదాకా కూడా వెళతారు. అయితే ఇదంతా ఒక ఆట. గొడవ పడిన హౌజ్ మేట్స్ అంతలోనే మళ్లీ కలిసి పోతారు. అయితే తమ అభిమాన కంటెస్టెంట్స్ కోసం సోషల్ మీడియాలో జరిగే గొడవలు మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి. ఫ్యా్న్స్ వార్ పేరుతో కంటెస్టెంట్లను, వారి కుటుంబ సభ్యులను బూతులు తిడుతుంటారు కొంత మంది. ఆడవాళ్లు, చిన్న పిల్లలు అనే ఇంగీత జ్ఞానం లేకుండా అసభ్య పదజాలంతో దూషిస్తుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కీర్తి భట్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గత వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన గౌతమ్‌కు సపోర్టుగా మాట్లాడినందుకు ఆమెను కొందరు బూతులు తిట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా అమర్ దీప్ ఫ్యాన్స్ అసభ్యకర పదజాలంతో కీర్తిని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారట. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఈ బిగ్ బ్యూటీ సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది.
గత కొన్ని రోజుల నుంచి నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. బిగ్‌బాస్ షో నుంచి ఎలిమి నేట్ అయ్యి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ సెలబ్రేషన్స్‌కు నేనూ వెళ్లాను. అక్కడ కొందరు అడిగితే ఇంటర్వ్యూలు అడిగితే ఇచ్చాను. అందులో నేను ఎవరి గురించి చెడుగా చెప్పలేదు. కానీ అమర్ దీప్ ఫ్యాన్స్ కొందరు నన్ను టార్గెట్‌గా చేసుకున్నారు. మాటల్లో చెప్పలేని బూతులు తిడుతున్నారు. గౌతమ్‌తో నాకు ముందు నుంచీ పరిచయమే లేదు. ఎవరి సపోర్టు లేకుండా అతను ఒంటరిగా ఆడడం నచ్చింది.. అందుకే దగ్గరకు వెళ్లి సపోర్ట్ చేశాను. నేను బిగ్‌బాస్ హౌజ్ లోపల ఉన్నప్పుడు ప్రియాంక, మానస్, మహేశ్ తప్ప ఇంకెవరూ నాకు సపోర్ట్ చేయలేదు. సోలోగా ఎవరు ఆడతారో వారికే నేను మద్దతిస్తాను. అందులో భాగంగానే ఇప్పుడు గౌతమ్‌ను సపోర్టు చేశాను. ఇంత దానికి నన్ను బూతులు తిడతారా?’
కీర్తి భట్ వీడియో
View this post on Instagram
కాళ్లు మొక్కుతా..
‘మీకు దండం పెడతా.. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఫ్యాన్స్ అన్న పేరుతో ఇతరులను ఇలా బాధ పెట్టకండి ప్లీజ్. ఇంత గలీజ్‌గా మాట్లాడొద్దు. నేనేమైనా తప్పు చేసి ఉంటే మీ అందరి కాళ్లు మొక్కుతా. నా తప్పు లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అమ్మాయిలను గౌరవించండి. హౌజ్ లోపల ఉన్న నలుగురి స్నేహితులకు నేను పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాను. అది మీకు తెలుసా? నా తిండి నేను తింటున్నాను. ఎవరి దగ్గరా అడుక్కోవట్లేదు.. నేను తిని నలుగురికి ఇస్తున్నాను. వీలైతే మీరు ఇతరులకు హెల్ప్ చేయండి. ఎవరు ఏ ఐడీ నుంచి మెసేజ్‌లు పంపుతున్నారో అవన్నీ ట్రాక్ చేస్తున్నా. ఇది శ్రుతి మించితే మాత్రం మీరెక్కడున్నా వచ్చి నడి రోడ్డుపై కొడతా.. అది కూడా మీ అమ్మతోనే కొట్టిస్తా..’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కీర్తి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలామంది అభిమానులు, నెటిజన్లు కీర్తికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
బిగ్ బాస్ హౌజ్ లో కీర్తి భట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.