Brahmamudi, December 9th episode: మొక్క గురించి ఇంట్లో హైరానా.. తల్లికి షాక్ ఇచ్చిన కావ్య.. అసలేం జరిగిందంటే!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. కళ్యాణ్ పెళ్లి గురించి ధాన్య లక్ష్మి, రుద్రాణి, అపర్ణ, పెద్దావిడ బాధ పడుతూ ఉంటారు. నిమ్మ మొక్క బతకాలని అనుకుంటూ ఉంటారు. ఇదంతా పై నుంచి వస్తున్న కావ్య వింటుంది. మరోవైపు కనకం మాత్రం.. ఈ మొక్క జరగదు.. ఈ పెళ్లి కూడా జరగనివ్వను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకు జాతకాల మీద అస్సలు నమ్మకం లేదని రుద్రాణి అంటే.. ఎందుకు లేదని అపర్ణ అడుగుతుంది. నా పెళ్లికి మంచి ముహూర్తం అని చెప్పి పెళ్లి చేశావ్..

Brahmamudi, December 9th episode:  మొక్క గురించి ఇంట్లో హైరానా.. తల్లికి షాక్ ఇచ్చిన కావ్య.. అసలేం జరిగిందంటే!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Dec 09, 2023 | 10:41 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. కళ్యాణ్ పెళ్లి గురించి ధాన్య లక్ష్మి, రుద్రాణి, అపర్ణ, పెద్దావిడ బాధ పడుతూ ఉంటారు. నిమ్మ మొక్క బతకాలని అనుకుంటూ ఉంటారు. ఇదంతా పై నుంచి వస్తున్న కావ్య వింటుంది. మరోవైపు కనకం మాత్రం.. ఈ మొక్క జరగదు.. ఈ పెళ్లి కూడా జరగనివ్వను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకు జాతకాల మీద అస్సలు నమ్మకం లేదని రుద్రాణి అంటే.. ఎందుకు లేదని అపర్ణ అడుగుతుంది. నా పెళ్లికి మంచి ముహూర్తం అని చెప్పి పెళ్లి చేశావ్.. అది కాస్తా పెటాకులు అయిపోయింది. నీ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుని ఉంటే నీ కాపురం కూడా నిలబడి ఉండేదని అపర్ణ అంటుంది. లోపం మనుషుల్లో ఉన్నప్పుడు.. ఈ జాతకాలు కూడా ఏమీ చేయలేవని రుద్రాణి అంటుంది.

రుద్రాణి చెప్పింది కూడా లాజిక్కే: ధాన్య లక్ష్మి

రుద్రాణి చెప్పినదాని గురించి కూడా లాజిక్ ఉంది కదా అక్క అని ధాన్య లక్ష్మి అంటుంది. జాతకాలు చూపించకుండానే కదా.. రాహుల్ కి, స్వప్నకి పెళ్లి జరిపించారు. అందుకేనేమో వాళ్ల మధ్య ఈ గొడవలు జరుగుతున్నాయని ధాన్య లక్ష్మి అంటే.. రాజ్, కావ్యలకు కూడా జాతకాలు చూడలేదు వాళ్ల కాపురం బాగానే ఉంది కదా అని రుద్రాణి అంటుంది. ఎక్కడున్నారు ఎప్పుడూ ఏదో ఒక రభస జరుగుతుంది కదా అని అపర్ణ అంటుంది. మీరు వాదించుకోవడం ఆపండి.. కళ్యాణ్ అనామికపై మనసు పడ్డాడు. ఆ పిల్ల కూడా వాడిని బాగా ఇష్ట పడుతుంది. దేవుడే కనుక వాళ్ల ఇద్దరికీ బ్రహ్మముడి వేయాలని రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఓపిక పట్టండి అని అంటుంది పెద్దావిడ. వాళ్లందరి మాటలు విన్న కనకం.. నా కూతురు అదృష్టం బావుండాలని మనసులో అనుకుంటుంది.

కళ్యాణ్ నుంచి డబ్బు కొట్టేయడానికి అనామిక తండ్రి ప్లాన్:

ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక తల్లిదండ్రులు కళ్యాణ్ పెళ్లి గురించి బాధ పడుతూ ఉంటారు. కళ్యాణ్ ని అడ్డు పెట్టుకుని మన అప్పులన్నీ తీర్చు కోవచ్చని అనుకున్నాం. కానీ ఇప్పుడు మొదటికే మోసం వచ్చేలా ఉంది. మనం ఏం చేయలేం. కానీ అనామిక చేస్తుంది. అని ఇద్దరూ కలిసి అనామిక దగ్గరకు వస్తారు. నువ్వు ప్రేమించావ్ అని చెప్పగానే మంచి కుటుంబంలోకి వెళ్తావ్ అనుకున్నా.. కానీ ఇలా పెళ్లి ఆగిపోతుంది అనుకోలేదని.. సుబ్రమణ్యం అంటాడు. అదేంటి డాడ్ అలా అంటున్నారు. నువ్వు ప్రేమించావ్ అని నాకు తెలుసు. కానీ కళ్యాణ్ నిన్ను అంతలా ప్రేమించలేదని తెలుస్తుంది. చెట్టు బతికి ఉంటే నిన్ను కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడు. లేదంటే.. నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాం అని చెప్పి అనామి పేరెంట్స్ వెళ్లి పోతారు.

ఇవి కూడా చదవండి

నన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చి పోతాను కళ్యాణ్ ని భయ పెట్టిన అనామిక:

వాళ్ల మాటలు విన్న అనామిక.. వెంటనే కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే డిన్నర్ చేశావా అని కళ్యాణ్ అడుగుతాడు. అది ముఖ్యం కాదు కళ్యాణ్.. సూటిగా నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు అని అనామిక అంటే.. ఏంటని అడుగుతాడు కళ్యాణ్. రేపు మొక్క బతికి ఉంటే మన పెళ్లి జరుగుతుంది. ఒకవేళ చనిపోతే.. నీ మౌనమే సమాధానం చెబుతుంది. నేను నిన్ను తప్ప వేరే వాళ్లను ఎవర్నీ పెళ్లి చేసుకోలేను. ఒక వేళ ఈ పెళ్లి ఆగిపోతే.. ఆ తర్వాత నువ్వు చూసేది నా చావునే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక.

కళ్యాణ్ ప్రేమ కోసం.. కావ్య, రాజ్ ల మధ్య తగాదా:

కళ్యాణ్, అనామిక పెళ్లి గురించి రాజ్, కావ్యలు గొడవ పడతారు. కవి గారి పెళ్లి గురించి ఆలోచించండి అని కావ్య అంటే.. నేనేం చేస్తాను గ్రహాలను ఏమీ మార్చలేను కదా అని రాజ్ అంటాడు. కవి గారు ఏమైపోతారో అని భయంగా ఉందని కావ్య, రాజ్ లు అనుంటారు. మనం మాత్రం ఏం చేస్తాం.. ఇంట్లో వాళ్లను బలవంతంగా కళ్యాణ్ పెళ్లి గురించి ఒప్పించినా.. వాళ్ల మధ్య చిన్న గొడవ జరిగినా అంతా మనల్నే అంటారని రాజ్ అంటారు. అయితే ఈ పెళ్లి జరగదు. చూస్తూ.. చూస్తూ ఒక ప్రేమ జంటను విడదీసి.. చేతులు దులిపేసుకుందాం. ఏదో ఒకటి చేయాలని కావ్య అంటుంది. నువ్వు ఎప్పుడూ ఏదో ఒకటి కంపు కంపు చేస్తావ్.. ఆ తర్వాత ఇంట్లో పంచాయితీ మొదలవుతుంది. ఈ విషయంలో ఎంతో అనుభవం ఉన్న తాతయ్యా, నాన్నమ్మలే ఏమీ చేయలేక పోతున్నారు. మనం ఏం చేస్తాం అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ పై చిరాకు పడి కావ్య వెళ్లి పోతుంది.

ఎండి పోయిన మొక్కను నాటిన కనకం:

ఆ తర్వాత ఎవరూ చూడకుండా కనకం.. కిందకు వస్తుంది. వచ్చి.. నిమ్మ మొక్కను చూస్తుంది. అది పచ్చగా ఉండటంతో.. వెంటనే వెళ్లి మొక్కను మార్చేస్తుంది. అక్కడ ఉన్నదంతా శుభ్రం చేసేస్తుంది. ఆ వెనకే కళ్యాణ్ వస్తూ ఉంటాడు. వెంటనే వచ్చి మొక్క చూస్తాడు. ఈలోపు కనకం వెనక నుంచి లోపలికి వెళ్తుంది. ఎండి పోయిన మొక్కను చూసిన కళ్యాణ్.. చాలా బాధ పడతాడు. ఆలోచిస్తూ అక్కడికక్కడే తిరుగుతాడు. అప్పూ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని ఆ మొక్కను తీయబోతాడు. వెంటనే పంతులు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని.. ఆగి పోతాడు. నా ప్రేమ కోసం ఇంట్లో వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టలేను అని అనుకుంటాడు కళ్యాణ్.

మొక్కను చూసి నోరెళ్ల బెట్టిన కనకం.. తల్లికి కూతురు షాక్:

ఆ తర్వాత తెల్లారుతుంది. దీంతో కనకం లేచి.. ఏమీ జరగదని అనుకుని కిందకు వస్తుంది. ఎవరూ బయటకు రాలేదని అనుకుంటుంది కనకం. కనకం వెళ్లి చూసేసరికి అందరూ మొక్క దగ్గరే ఉంటారు. మొక్క చచ్చి పోయిందని తెలిసి అలానే ఉండి పోయారనుకుంటుంది కనకం. తీరా అక్కడికి వెళ్లి కనకం షాక్ అవుతుంది. మొక్కను చూసి నోరెళ్లబెడుతుంది. దీంతో అక్కడున్న వారందూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ లోపు అనామిక ఫ్యామిలీ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే మొక్క విషయం వెంటనే అనామికకు ఫోన్ చేసి చెప్తాడు కళ్యాణ్. గుడ్ న్యూస్.. చెట్టు బతికే ఉందని అంటాడు.

కావ్యకి థాంక్స్ చెప్పిన కళ్యాణ్:

మరోవైపు కావ్య దగ్గరకు వచ్చి కళ్యాణ్ థాంక్స్ చెప్తాడు. నాకెందుకు థాంక్స్ చెబుతున్నారు.. అని కావ్య అంటే లేదు మీకే చెప్పాలి అని అంటాడు కళ్యాణ్. నేనేం చేశాను కవి గారూ అని కావ్య అంటే.. నాకు అంతా తెలుసు. ఆ మొక్క నాటింది మీరే అని నాకు తెలుసు అని కళ్యాణ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.