Masterchef 2: మాస్టర్‌చెఫ్ ఇండియా విజేతగా ఆషిక్.. రూ. 25 లక్షలు గెలుచుకున్న జ్యూస్ షాప్ యజమాని

హోమ్ చెఫ్ ఫైనలిస్టులు రుక్సార్ సయీద్, మహ్మద్ ఆషిక్, నంబి జెస్సికా..  సూరజ్ థాపా తమ సిగ్నేచర్ తెలిసేలా ఆహారాన్ని సిద్ధం చేయమని చెఫ్‌లు (న్యాయమూర్తులు) టాస్క్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి తమకు ఇష్టమైన వంటకం సిద్ధం చేయడానికి 90 నిమిషాల సమయం ఇచ్చారు. ముందుగా సూరజ్ థాపా తన వంటకాన్ని న్యాయమూర్తుల ముందు సమర్పించాడు. సూరజ్ ఇంగ్లీషు బ్రేక్ ఫాస్ట్ డెజర్ట్ డిష్ సిద్ధం చేశాడు. ముగ్గురు న్యాయమూర్తులను తన ప్రదర్శన, ఫుడ్ తో బాగా ఆకట్టుకున్నారు.

Masterchef 2: మాస్టర్‌చెఫ్ ఇండియా విజేతగా ఆషిక్.. రూ. 25 లక్షలు గెలుచుకున్న జ్యూస్ షాప్ యజమాని
Mohammed Aashiq
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2023 | 10:44 AM

కర్ణాటక మంగళూరులో నివసిస్తున్న 24 ఏళ్ల మహ్మద్ ఆషిక్ మాస్టర్‌చెఫ్ ఇండియా 2 ట్రోఫీని గెలుచుకున్నాడు. డిసెంబర్ 8న సోనీ లైవ్ లో ప్రసారం చేయబడిన గ్రాండ్ ఫినాలేలో మాస్టర్‌చెఫ్..  చివరి పోటీ 4 ఫైనలిస్టుల మధ్య జరిగింది. హోమ్ చెఫ్ ఫైనలిస్టులు రుక్సార్ సయీద్, మహ్మద్ ఆషిక్, నంబి జెస్సికా..  సూరజ్ థాపా తమ సిగ్నేచర్ తెలిసేలా ఆహారాన్ని సిద్ధం చేయమని చెఫ్‌లు (న్యాయమూర్తులు) టాస్క్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి తమకు ఇష్టమైన వంటకం సిద్ధం చేయడానికి 90 నిమిషాల సమయం ఇచ్చారు. ముందుగా సూరజ్ థాపా తన వంటకాన్ని న్యాయమూర్తుల ముందు సమర్పించాడు. సూరజ్ ఇంగ్లీషు బ్రేక్ ఫాస్ట్ డెజర్ట్ డిష్ సిద్ధం చేశాడు. ముగ్గురు న్యాయమూర్తులను తన ప్రదర్శన, ఫుడ్ తో బాగా ఆకట్టుకున్నారు.

రెండవ వంటకం రుక్సార్ సయీద్ కాశ్మీరీ వంటకాలను ఒక ప్లేట్‌లో సిద్ధం చేసి న్యాయమూర్తుల ముందు ఉంచాడు. వికాస్.. రుక్సార్ వంటకంతో చాలా ఇంప్రెస్ అయ్యాడు. అంతేకాదు ఈ వంటకాన్ని ఖచ్చితంగా ఏదైనా మిచెలిన్ రెస్టారెంట్ మెనూలో పెట్టవచ్చని పేర్కొన్నాడు. మరిచిపోయిన కాశ్మీరీ వంటకాలను గుర్తు చేస్తూ మళ్ళీ ఈ వంటలపై పుస్తకం రాయమని వికాస్..  రుక్సర్‌కి సలహా ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మహ్మద్ ఆషిక్ న్యాయమూర్తుల ముందు పీతతో చేసిన వంటకాన్ని అందించాడు. దీనిని చూసి వికాస్ భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అతడిని ప్రశంసిస్తూ, ‘ప్రజలు నన్ను తప్పులు కనుగొనే యంత్రం అని పిలుస్తారు.  కానీ నేను ఈ వంటకంలో ఎటువంటి తప్పును కనుగొనలేకపోయాను’ అని చెప్పాడు.

టాప్ 4 సిగ్నేచర్ వంటకాలను ఇక్కడ చూడండి! మీకు ఇష్టమైన గ్రాండ్ ఫినాలే డిష్ ఏది?

హృదయాలను గెలుచుకున్న నంబి

మహ్మద్ ఆషిక్ తర్వాత నంబి జెస్సికా బ్లాక్ రైస్‌తో చేసిన ‘స్క్వేర్ రూట్’ని న్యాయమూర్తుల ముందు ప్రదర్శించారు. ఈ వంటకాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వంటకానికి ప్యూర్ రూట్ అని పేరు పెట్టండి.. మీరు దీన్ని నిజాయితీగా వండిన విధానం ఈ డిష్‌లో కనిపిస్తుంది’ అని రణ్‌వీర్ అన్నాడు.

జ్యూస్‌ దుకాణం నడిపిన ఆషిక్

అన్ని వంటకాలను ప్రదర్శించిన తర్వాత న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటించారు. 25 లక్షలతో పాటు సీజన్ ట్రోఫీని మహ్మద్ ఆషిక్ గెలుచుకున్నాడు. ఈ షోలో సెకండ్ రన్నరప్‌గా రుక్సర్ సయీద్ పేరు ప్రకటించగా, నంబి జెస్సికా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. వీరిద్దరికీ ట్రోఫీతోపాటు రూ.5 లక్షల ప్రైజ్ మనీ లభించింది. అయితే మాస్టర్ చెఫ్‌ పోటీల్లో పాల్గొనడానికి ముందు మహ్మద్ ఆషిక్ మంగళూరులో జ్యూస్ దుకాణం నడిపేవాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..