AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రంటే గౌరవం.. అయినా ఆయన చనిపోతే కనీసం చూడడానికి కూడా వెళ్లని ఒకప్పటి టాప్ హీరోయిన్

వాస్తవానికి రేఖ తన తండ్రితో సత్సంబంధాలను కొనసాగించలేకపోయింది. ఎందుకంటే జెమిని గణేశన్ తన  భార్య హోదాను రేఖ తల్లి పుష్ప వల్లికి ఎప్పుడూ ఇవ్వలేదు. వీరి బంధంలో ఎంత దూరం ఉండేదంటే.. తన తండ్రి చనిపోయినప్పుడు.. రేఖ అతనిని చివరిసారిగా చూడటానికి కూడా వెళ్ళలేదు. 1994లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేదికపై ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ సమయంలో రేఖ .. తన తండ్రిని వృత్తిపరంగా కలిశారు. తన తండ్రికి అవార్డు ఇవ్వడానికి రేఖ వేదికపైకి వచ్చారు. 

తండ్రంటే గౌరవం.. అయినా ఆయన చనిపోతే కనీసం చూడడానికి కూడా వెళ్లని ఒకప్పటి టాప్ హీరోయిన్
Rekha Gemini Ganesh
Surya Kala
|

Updated on: Nov 17, 2023 | 1:35 PM

Share

దక్షిణాది నుంచి బాలీవుడ్ లో అడుగు పెట్టి.. తన నటనతో అందంతో ప్రేక్షకులకు కలల సుందరిగా మారింది. పోయిన చోటే వెదుక్కున్నట్లు వద్దు అన్నవారి నోటితోనే జేజేలు కొట్టించుకుని నేటికీ చెక్కు చెదరని అందంతో చూపరులను ఆకట్టుకుంది రేఖ గణేశన్. సినిమాల్లో మాత్రమే కాదు నటి రేఖ జీవితంలో కూడా అనేక కథలు ఉన్నాయని ఫిల్మ్ వర్గాల టాక్. నేడు రేఖ తండ్రి జెమినీ గణేశన్ జయంతి. దాదాపు 30 ఏళ్లు సినీ ఇండస్ట్రీని శాసించిన జెమినీ గణేశన్ ను తమిళ సినిమా లెజెండ్‌గా పరిగణిస్తారు. అయితే జెమినీ గణేశన్ వ్యక్తిగత జీవితం చాలా వరకు వివాదాల మయం. అవును జెమినీ గణేశన్ భార్య బతికి ఉండగానే పెళ్లి మీద పెళ్లి అలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అంతేకాదు మరో నటి పుష్పవల్లితో రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. వీరిద్దరికి ఇద్దరు అమ్మాయిలు. వారిలో ఒక అమ్మాయి రేఖ. అయితే రేఖకి తండ్రికి మధ్య మంచి సంబంధాలు సరిగా ఉండేవి కావని టాక్.  రేఖ తన జీవితంలో తండ్రి పేరుని ఉపయోగించుకోలేదు..  ఆయన నీడలో జీవించలేదు. తండ్రి రేఖ జీవితంలో ఒక పదంగా మాత్రమే మిగిలిపోయాడు.

తండ్రిని చివరిసారి ఎప్పుడు కలుసుకున్నదంటే..

వాస్తవానికి రేఖ తన తండ్రితో సత్సంబంధాలను కొనసాగించలేకపోయింది. ఎందుకంటే జెమిని గణేశన్ తన  భార్య హోదాను రేఖ తల్లి పుష్ప వల్లికి ఎప్పుడూ ఇవ్వలేదు. వీరి బంధంలో ఎంత దూరం ఉండేదంటే.. తన తండ్రి చనిపోయినప్పుడు.. రేఖ అతనిని చివరిసారిగా చూడటానికి కూడా వెళ్ళలేదు. 1994లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేదికపై ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ సమయంలో రేఖ .. తన తండ్రిని వృత్తిపరంగా కలిశారు. తన తండ్రికి అవార్డు ఇవ్వడానికి రేఖ వేదికపైకి వచ్చారు.

ఇవి కూడా చదవండి

తండ్రిని ఎప్పుడు కించపరచని వ్యక్తిత్వం రేఖ సొంతం

అయితే, తండ్రీకూతుళ్ల మధ్య సంబంధం ఎలా ఉన్నాసరే.. రేఖ ఎప్పుడూ ప్రజల ముందు తన తండ్రిని చాలా గౌరచించారు. ఒక్కసారి కూడా తండ్రి గురించి తప్పుగా మాట్లాడింది లేదు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ స్టేజ్‌కి చేరుకున్న రేఖ వెంటనే తన తండ్రి పాదాలను తాకి నమస్కరించారు కూడా. అంతేకాదు తండ్రి కూతురు  ఒకరినొకరు చూసుకుని కంట తడి పెట్టారు. ఇప్పుడు జెమిని గణేశన్ జీవించి లేదు.. ఈ  ప్రపంచాన్ని విడిచి వెళ్లారు.. అయితే తండ్రి పట్ల ఎటువంటి భావం ఉందొ ఒక్క రేఖకి మాత్రమే తెలుసు.. ఆమె హృదయం మాత్రమే చెప్పగలదు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..