AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Family: ఇటలీలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఫ్యామిలీ.. వినూత్నంగా క్లీంకారా ఫేస్ రివీల్

తన అత్తామామలైన చిరంజీవి సురేఖలు, భర్త రామ్ చరణ్ తో పాటు కామినేని ఫ్యామిలీ తో కలిసి మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఉన్న ఫోటో ను సోషల్ మీడియా పోస్ట్ చేసారు ఉపాసన. అయితే ఈ ఫోటో లో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే.. అసలు ఫొటోలో క్లీంకారా ఫేస్ కు ఎప్పటిలా లవ్ సింబల్ ఉన్న ఎమోజీతో కవర్ చేయగా.. ఫోటోలోని పర్సన్ ను చూపిస్తున్న నీటిలో పాప పేస్ క్లియర్ గా కనిపించడం.

Mega Family: ఇటలీలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఫ్యామిలీ.. వినూత్నంగా క్లీంకారా ఫేస్ రివీల్
Konidela Klin Kaara
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 29, 2023 | 5:57 PM

Share

కొణిదెల వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నవంబర్ 1వ తేదీన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమించిన లావణ్యను పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే పెళ్లి వేడుకల సందడి మొదలైంది. మెగా ఫ్యామిలీ తో పాటు , లావణ్య ఫ్యామిలీ కూడా ఇటలీ చేరుకుంది. ఇటలీలోని టుస్కానీలో కొణిదెల వారి ఫ్యామిలీతో పాటు కామినేని కుటుంబం సెలవులను ఆస్వాదిస్తున్నారు. తాజాగా నెట్టింట్లో మెగా ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తన అత్తామామలైన చిరంజీవి సురేఖలు, భర్త రామ్ చరణ్ తో పాటు కామినేని ఫ్యామిలీ తో కలిసి మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఉన్న ఫోటో ను సోషల్ మీడియా పోస్ట్ చేసారు ఉపాసన. అయితే ఈ ఫోటో లో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే.. అసలు ఫొటోలో క్లీంకారా ఫేస్ కు ఎప్పటిలా లవ్ సింబల్ ఉన్న ఎమోజీతో కవర్ చేయగా.. ఫోటోలోని పర్సన్ ను చూపిస్తున్న నీటిలో పాప పేస్ క్లియర్ గా కనిపించడం.

ఫొటోలో క్లీంకారా పేస్ ను ఎమోజి తో కవర్ చేసిన నీటి లో పడిన ప్రతిబింబం లో క్లియర్ గా పేస్ కనబడుతుంది. దీంతో మెగా అభిమనులకు తొలిసారి రామ్ చరణ్ ఉపాసన ముద్దుల కూతురు క్లిమ్ కారా ను చూసినట్టు అయింది. మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్ లావణ్య త్రిపారిల పెళ్లి కోసం ఇటలీకి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా తో కలిసి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఇటలీలో మెగా స్టార్ ఫ్యామిలీ దిగిన ఫోటో లో ఈ చిత్రం చోటు చేసుకుంది. గత మూడు నెలలుగా పాప చిత్రం బయట కనిపించకుండా జాగ్రత్త వహించిన చివరికి ఇటలీ డేష్టినేషన్ వెడ్డింగ్ లో చిన్నారి ఫోటో బయటకు రావడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.క్లీంకారా పుట్టినప్పటి నుండి ఆమె తో దిగిన ఫోటో లు సోషల్ మీడియా లో అనేకసార్లు అప్లోడ్ చేసిన ఎప్పుడు ముఖం కనబడకుండా జాగ్రత్త పడ్డారు మెగా ఫ్యామిలీ. మూడు నెలల తర్వాత క్లీంకారా ముఖం నీటి ప్రతిబింబం లో బయటకు రావడంతో పాపా ఎలా ఉందా అనే ఆసక్తితో చిత్రాన్ని గమనిస్తున్నారు.

వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి నవంబర్ 1వ తేదీన జరగనున్నది. 5వ తేదీన హైదరాబాద్ లో పెళ్లి రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయనున్నారని.. సినీ నటీనటులతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..